Karthika Deepam Nirupam New Serial Pallakilo Pellikuthuru
Karthika Deepam Nirupam : బుల్లితెరపై నిరుపమ్ పరిటాల సంపాదించుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కార్తీక దీపం సీరియల్‌లో కార్తీక్, డాక్టర్ బాబుగా నిరుపమ్ తెచ్చుకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నిరుపమ్ పరిటాల తన భార్యతో కలిసి నటించడం లేదు. దానికి చాలానే కారణాలున్నాయి. ఈ ఇద్దరూ కలిసి చంద్రముఖి సీరియల్‌లో నటించారు. ఈ సీరియల్‌తోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వివాహాం వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి సీరియల్స్‌లో నటించడం లేదు. దీనిపై మంజుల ఆమద్య స్పందించింది.
తామిద్దరం కలిసి నటించడం కుదరదని, తనకు ఇప్పుడు ఎవ్వరూ కూడా హీరోయిన్ పాత్రలు ఇవ్వరని, తన పక్కన అలా నటించలేనని, తనకు అక్కా, వదిన ఇలాంటి పాత్రలు ఇస్తుంటారని అందుకే తామిద్దరం కలిసి నటించలేమని చెప్పేసింది. అయితే ఇప్పుడు నిరుపమ్ కొత్త సీరియల్లో మంజుల కూడా నటించేస్తోంది. అసలే నటుడిగానే కాకుండా నిరుపమ్ సీరియల్స్ కూడా నిర్మిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. తన తండ్రి పేరు ఓంకార్ వచ్చేట్టుగా ఓం ఎంటర్టైన్మెంట్స్ మీద సీరియల్స్ నిర్మిస్తుంటాడు. ఇది వరకు హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌లో నిరుపమ్ నటించాడు.
Karthika Deepam Nirupam New Serial Pallakilo Pellikuthuru
నిర్మించాడు. జీ తెలుగులో వచ్చిన ఈ సీరియల్ తక్కువ కాలంలోనే ఎక్కువగా ఫేమస్ అయింది. నిరుపమ్‌కు కొత్త ఇమేజ్ తెచ్చి పెట్టేసింది. అయితే తక్కువ రోజులే ఈ సీరియల్ రావడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. ఇంకో సీరియల్ గురించి ఎప్పుడూ నిరుపమ్‌ను అడుగుతుంటారు. అయితే తాజాగా తాను నిర్మిస్తోన్న కొత్త సీరియల్ గురించి అప్డేడ్ ఇచ్చాడు. పల్లికలో పెళ్లికూతురు అనే కొత్త సీరియల్ రాబోతోందని, అది స్టార్ మాలో వస్తోందని చెప్పుకొచ్చింది. ఇందులో మంజుల కూడా ఓ పాత్రలో కనిపించబోతోన్నట్టుంది. కానీ నిరుపమ్ నటిస్తాడా? లేదా? అన్నది తెలియడం లేదు. మరి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
This website uses cookies.