Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్.. ఆరోహి పరువుతీసిన ఆదిరెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్.. ఆరోహి పరువుతీసిన ఆదిరెడ్డి

 Authored By prabhas | The Telugu News | Updated on :12 September 2022,10:00 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ షోలో నామినేషన్లు, ఎలిమినేషన్లు తప్పవన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం నాటి ఎపిసోడ్ మంచి ఊపు మీదుంటుంది. ఎందుకంటే ఆ రోజు నామినేషన్ల పేరుతో ఒకరిపై ఒకరు తమ తమ రాగద్వేషాలు, పగలను తీర్చుకుంటారు. కసితీరా తిట్టుకుంటారు. మాటామాటా పెరుగుతుంది. గొడవలు జరుగుతుంటాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ ఇంట్లో మొదటి వారం అందరికీ షాక్ ఇచ్చినట్టు అయింది. అది బిగ్ బాస్ కంటెస్టెంట్లకు హ్యాపీగా ఉంటే.. ఆడియెన్స్‌కు చికాకుగా అనిపించింది. కష్టపడి జనాలు వేసిన ఓట్లకు విలువ లేకుండా పోయింది.

బిగ్ బాస్ ఇంట్లో మొదటి వారం నో ఎలిమినేషన్ అని నాగార్జున సింపుల్‌గా తేల్చి చెప్పేశాడు. అయితే ఇప్పుడు రెండో వారానికి సంబంధించిన నామినేషన్‌ల ప్రోమోలు వచ్చాయి. ఇందులో ఒక్కొక్కరు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరికి మనసులో ఉన్న కోపాలను, ద్వేషాలను బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ క్రమంలో ఆదిరెడ్డి ఆరోహిల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. తనతో అంతగా అటాచ్ అవ్వలేదంటూ ఆదిరెడ్డిని ఆరోహి నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఆట ఆడని వాళ్లని నామినేట్ చేస్తావా?

Bigg Boss 6 Telugu 2nd Week Nominations adireddy vs arohi

Bigg Boss 6 Telugu 2nd Week Nominations adireddy vs arohi

నీకు అటాచ్ కాలేదని నామినేట్ చేస్తావా? అని ఆరోహిని అడిగేశాడు ఆదిరెడ్డి. అయితే ఆడని వాళ్లని నామినేట్ చేస్తాను అని ఆరోహి అంటుంది. నువ్ ఎక్కడ ఆడావ్? అని ఆదిరెడ్డిని ఆరోహి ప్రశ్నిస్తుంది. నీ కంటే బాగానే ఆడానులే అని ఆదిరెడ్డి అంటాడు. నాకంటేనా? అని ఆరోహి ఓ వెకిలి నవ్వు నవ్వేస్తుంది. నువ్ ఏం వెలగబెట్టావ్ అన్నట్టుగా ఆదిరెడ్డి దారుణంగా వెక్కిరించేశాడు. అయితే ఇప్పటి వరకు వచ్చిన రెండు ప్రోమోల్లో గలాట గీతూ రేవంత్ కీర్తి భట్ విషయాలే ఎక్కువగ వైరల్ అవుతున్నాయి. మంచితనం ముసుగు వేసుకున్నాడని షానీని అందరూ నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది. తనకు కోపం తెప్పించండి.. చిరాకు పెట్టండి అప్పుడు కోప్పడతాను అని షాని అనేశాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది