Bigg Boss 6 Telugu Has Unexpected Changes In Contestants List
Bigg Boss 6 Telugu : బుల్లితెర ఎంటర్‌టైన్మెంట్ బిగ్‌బాస్ షో సీజన్ 6 ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు నిర్వాహకులు శుభవార్త అందించారు.ఓవైపు ఆసియా కప్ ప్రారంభమవ్వగా.. మరోవైపు బిగ్‌బాస్ కూడా ఇదే టైంలో ప్రారంభం కానుండటంతో ఈసారి అభిమానులు ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక గందరగోళానికి గురయ్యే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 6వ సీజన్ సెప్టెంబర్ 4న సాయంత్రం ఆరు గంటలకు గ్రాండ్ స్టార్ట్ ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ సీజన్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే దగ్గర నుంచి లోపల జరిగే ఏర్పాట్లు.. సౌకర్యాల విషయంలోనూ కంటెస్టెంట్ల కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని సమాచారం. ఇక కంటెస్టెంట్ల ఎంపికతో పాటు వారి ఎలిమినేషన్స్ వరకు అన్ని ముందే పక్కగా ప్లాన్ చేస్తున్నారని లీక్స్ వస్తున్నాయి. ఇదిలాఉండగా ఇప్పటికే విడుదలైన బిగ్‌బాస్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bigg Boss 6 Telugu Has Unexpected Changes In Contestants List
ఈసారి కంటెస్టెంట్ల విషయంలోనూ బిగ్‌బాస్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట..సీజన్ -5లో జరిగిన పొరపాట్లు, గొడవలు వంటి మరీ ఓవర్‌గా లేకుండా ప్లాన్ చేస్తున్నారంట.. ఇక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో అభినయ శ్రీ, ఇనయ సుల్తానా, సుదీప, నటుడు బాలాదిత్య, జబర్దస్త్ కమెడియన్లు చలాకీ చంటి, ఫైమా, గలాటా గీతూ, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి, వాసంతి కృష్ణన్, నటుడు శ్రీహాన్, తన్మయ్, శ్రీసత్య, యాంకర్ ఆరోహి రావు, బుల్లితెర జోడీ రోహిత్ – మెరీనా అబ్రహం, అర్జున్ కల్యాణ్, కామన్ మ్యాన్ రాజశేఖర్, దీపిక పిల్లి వంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కానీ చివరకు ఇందులో ఎవరు ఫైనల్ అవుతారో వేచిచూడాల్సిందే.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.