Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్ సీజన్ 6 లో ఊహించని మార్పులు.. కంటెస్టెంట్ల ఎంట్రీతో ఏం జరగబోతోంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్ సీజన్ 6 లో ఊహించని మార్పులు.. కంటెస్టెంట్ల ఎంట్రీతో ఏం జరగబోతోంది?

 Authored By mallesh | The Telugu News | Updated on :30 August 2022,8:40 pm

Bigg Boss 6 Telugu : బుల్లితెర ఎంటర్‌టైన్మెంట్ బిగ్‌బాస్ షో సీజన్ 6 ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు నిర్వాహకులు శుభవార్త అందించారు.ఓవైపు ఆసియా కప్ ప్రారంభమవ్వగా.. మరోవైపు బిగ్‌బాస్ కూడా ఇదే టైంలో ప్రారంభం కానుండటంతో ఈసారి అభిమానులు ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక గందరగోళానికి గురయ్యే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

Bigg Boss 6 Telugu : కొత్త సీజన్‌లో ఊహించని ట్విస్టులు

ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ తెలుగు 6వ సీజన్‌ సెప్టెంబర్‌ 4న సాయంత్రం ఆరు గంటలకు గ్రాండ్ స్టార్ట్ ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ సీజన్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హౌస్‌‌లోకి ఎంట్రీ ఇచ్చే దగ్గర నుంచి లోపల జరిగే ఏర్పాట్లు.. సౌకర్యాల విషయంలోనూ కంటెస్టెంట్ల కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని సమాచారం. ఇక కంటెస్టెంట్ల ఎంపికతో పాటు వారి ఎలిమినేషన్స్ వరకు అన్ని ముందే పక్కగా ప్లాన్ చేస్తున్నారని లీక్స్ వస్తున్నాయి. ఇదిలాఉండగా ఇప్పటికే విడుదలైన బిగ్‌బాస్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bigg Boss 6 Telugu Has Unexpected Changes In Contestants List

Bigg Boss 6 Telugu Has Unexpected Changes In Contestants List

ఈసారి కంటెస్టెంట్ల విషయంలోనూ బిగ్‌బాస్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట..సీజన్ -5లో జరిగిన పొరపాట్లు, గొడవలు వంటి మరీ ఓవర్‌గా లేకుండా ప్లాన్ చేస్తున్నారంట.. ఇక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో అభినయ శ్రీ, ఇనయ సుల్తానా, సుదీప, నటుడు బాలాదిత్య, జబర్దస్త్‌ కమెడియన్లు చలాకీ చంటి, ఫైమా, గలాటా గీతూ, సింగర్‌ రేవంత్‌, యూట్యూబర్‌ ఆదిరెడ్డి, వాసంతి కృష్ణన్‌, నటుడు శ్రీహాన్‌, తన్మయ్‌, శ్రీసత్య, యాంకర్‌ ఆరోహి రావు, బుల్లితెర జోడీ రోహిత్‌ – మెరీనా అబ్రహం, అర్జున్‌ కల్యాణ్‌, కామన్‌ మ్యాన్‌ రాజశేఖర్‌, దీపిక పిల్లి వంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కానీ చివరకు ఇందులో ఎవరు ఫైనల్ అవుతారో వేచిచూడాల్సిందే.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది