
actress sadha was shocked and saddened to hear rumours
Sadha : జయం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ సదా. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఒకప్పుడు మంచి సినిమాలలో నటించిన సదా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. సినిమాలకు దూరమైనా తమిళ్, తెలుగు బుల్లితెరలపై ఆయా షో లలో కనిపిస్తూ వినోదాన్ని పంచుతోంది. ఇటీవలే సదా నటించిన హలో వరల్డ్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో విడుదలై సూపర్ సక్సెస్ ను అందుకుంది. అయితే ఈ అమ్మడు రీసెంట్‌గా పెళ్లిపై తనకున్న అభిప్రాయాన్ని చెప్పింది. 38 ఏళ్లు వచ్చినా పెళ్లికాకపోతే నాకు లేని బాధ వాళ్లకి ఎందుకు ? అని ప్రశ్నించింది.
10 పెళ్లిళ్లు జరిగితే.. వాటిలో 5 జంటలైనా హ్యాపీగా ఉండట్లేదని కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయింది సదా. పోనీ పెళ్లి చేసుకుంటే ఎలాంటి వాడు అయి ఉండాలి అన్న ప్రశ్నకు తన మదిలో మాట చెప్పింది. తనను పెళ్లి చేసుకునే వ్యక్తి ధనవంతుడు కాకపోయినా ఫర్వాలేదు కానీ.. బ్రతకడం కోసం పక్కవారిపై ఆధారపడకూడదని చెప్పింది. తన అవసరాల కోసమైనా తాను సంపాదించుకోగలగాలని, అలాగే పూర్తి శాఖాహారి అయి ఉండాలని సదా మదిలో మాట చెప్పింది. అయితే ఈ అమ్మడు తమిళ్ లో హీరో మాధవన్ తో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేసింది. వీటిలో ప్రియా సఖి సినిమా చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అయితే ఆ సమయంలో సదా.. మాధవన్ పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.
actress sadha was shocked and saddened to hear rumours
ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ తమ కుటుంబ పరిస్థితుల రీత్యా సదా తన ప్రియుడిని పెళ్లి చేసుకోలేకపోయిందని కొందరు చర్చించుకుంటున్నారు.. అందుకే నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నప్పటికీ తన ప్రియుడిని మర్చిపోలేక నటి సదా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ వార్తలు గత వారం రోజులుగా సోషల్ మీడియా మాధ్యమాలలో షేక్ చేస్తున్నాయి. అయితే ఆ వార్తలు విని తాను చాలా బాదపడ్డానని అన్నారు సదా. మొదట్లో చాలా బాధగా అనిపించింది. కానీ ఆలాంటి రూమర్స్ రావడం కామనే అని ఇప్పుడు పట్టించుకోవడం మానేశా అని చెప్పుకొచ్చింది. నాకు నచ్చిన అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పుకొచ్చింది అందాల ముద్దుగుమ్మ.
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
This website uses cookies.