Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో వీక్ డేస్ లో ఆట ఎలా ఉన్నా సరే వీకెండ్ నాగార్జున వచ్చి ఆట పై తన రివ్యూ చెప్పడం.. హౌజ్ మెట్స్ ని అలర్ట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఎప్పటిలానే ఆరవ వారం కూడా తన జోష్ ఫుల్ హోస్టింగ్ తో అలరించారు నాగార్జున. ఆయన రావడమే వీకెండ్ ఎపిసోడ్ కి కొత్త జోష్ వస్తుంది. ఇక ఈ వీక్ లో హౌజ్ మెట్స్ అందరి కన్నా రోహిత్ మీద ఎక్కువ ప్రశంసలు కురిపించాడు కింగ్. అలా ఎందుకు అంటే రోహిత్ ఈ వారం బ్యాటరీస్ టాస్క్ లో సాక్రిఫైజ్ చేసి మరె హౌస్ మెట్స్ వాళ్ల ఇంట్లో వాళ్లతో కమ్యునికేట్ అయ్యేలా చేశాడు.
అంతేకాదు రెండు వారాలు డైరెక్ట్ నామినేట్ అయ్యేందుకు కూడా అతను ఒప్పుకున్నాడు. ఇవన్ని అతనికి ప్లస్ అయ్యేలా చేశాయి. ఈ క్రమంలో రోహిత్ మీద ఆడియన్స్ లో కూడా క్రేజ్ పెరిగింది. ఇది కనిపెట్టిన బిగ్ బాస్ టీం నాగార్జునకి కూడా రోహిత్ మీద పాజిటివ్ రివ్యూ ఇచ్చేయమని స్క్రిప్ట్ ఇచ్చేశారు. అంతే నాగార్జున రోహిత్ నువ్వు గ్రేట్ జాబ్ చేశావ్ అంటూ పొగిడేశాడు. అంతేకాదు హౌస్ మెట్స్ కోసం తను త్యాగం చేస్తే స్పెషల్ గిఫ్ట్ కింద రోహిత్ కోసం వాళ్ల నాన్న వీడియో మెసేజ్ కూడా చూపించారు. ఈ వీక్ ఎపిసోడ్ మొత్తం రోహిత్ కి చాలా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రోహిత్ సిన్సియారిటీ ఆడియన్స్ కి అర్ధమైంది.
అదే నాగార్జున కూడా ప్రస్థావించారు. అయితే నాగ్ రోహిత్ ని ఆకాశానికి ఎత్తేస్తుంటే మిగతా హౌజ్ మెట్స్ కొద్దిగా ఫీల్ అయినట్టు అనిపిస్తుంది. నాగ్ సర్ దృష్టిలో రోహిత్ పడ్డాడు అంటే అతను ఆడియన్స్ దృష్టిలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటాడని వాళ్లు ఫీల్ అవుతున్నారు. రోహిత్ తమ కోసం సాక్రిఫైజ్ చేశాడని హౌజ్ మెట్స్ ఆరుగురు నిలబడినా ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ రోహిత్ కి మంచి హై ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో రోహిత్ కూడా టాప్ 5 కంటెస్టంట్ అని గట్టిగా చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ లో వారం వారానికి లెక్కలు మారుతుంటాయి. రోహిత్ ఇదే ఆట కొనసాగించి రాబోయే రోజుల్లో మరో టాస్క్ బాగా ఆడితే మాత్రం పక్కా టాప్ 5 లో ఉంటాడని చెప్పొచ్చు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.