Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సంద‌డి ఆ రోజు నుండి మొద‌ల‌వ్వ‌డం ప‌క్కా.. క్వారంటైన్‌లో కంటెస్టెంట్స్

Authored By Sam C | The Telugu News | Published on: August 17, 2022, 12:40 pm

Bigg Boss 6 Telugu : ప్ర‌తి ఏడాది బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం తెలుగులో ఐదు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. అలానే ఒక ఓటీటీ షో కూడా పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లో సీజ‌న్ 6 జ‌రుపుకోనుండ‌గా, దీనికి సంబంధించి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి . సెప్టెంబ‌ర్ సాయంత్రం ఆరు గంట‌ల‌కు షో మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుండగా, ఈ షోకి నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇక బ‌జ్‌కి శివ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించబోతున్న‌ట్టు తెలుస్తుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌‌తో సీజన్ 6 ఆటను రంజుగా ప్లాన్ చేశారు. వారిలో 10 మంది అమ్మాయిలు కాగా.. 9 మంది అబ్బాయిలు ఉండబోతున్నారు.

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ హంగామా..

వీరిలో సినిమా, టీవీ సెలబ్రీటీలు, యాంకర్లు, యూట్యూబర్స్, సోషల్ మీడియా సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా ఉండబోతుండగా.. కామన్ మెన్/ ఉమెన్ కేటగిరీలో ఇద్దరు ఉండబోతున్నారు. లాంచింగ్ రోజున 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లబోతుండగా.. మిగిలిన నలుగుర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపబోతున్నారు. ఇటీవలే ఈ సీజన్ లోగో ప్రోమోను వదిలారు. అలాగే, సీజన్ మెయిన్ ప్రోమోను రిలీజ్ చేశారు. వీటికి భారీ స్పందన కూడా దక్కింది. దీనిబట్టే ఈ సీజన్ ఎంతో కలర్‌ఫుల్‌గా సాగబోతున్నట్లు అర్థం అవుతోంది.

Bigg Boss 6 Telugu starts from september

Bigg Boss 6 Telugu starts from september

వాస్తవానికి బిగ్ బాస్ షోలో జరిగే తీరు మొత్తం సీక్రెట్‌గా ఉంచుతారు. కానీ, ఇందులోని ప్రతి విషయం బయటకు వస్తూనే ఉంది. దీంతో ఆరో సీజన్ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇలా ఇప్పటికే పలు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో నిర్వహకులు ఏం చేయాలో తెలియక షాక్ అవుతున్నారు. ఉద‌య భాను ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో సంద‌డి చేయ‌నుంద‌ని అనే స‌రికి అంద‌రికి దీనిపై ఆస‌క్తి పెరిగింది. ఇందులో నిజం ఎంత ఉంద‌నేది తెలియాలంటే, కొద్ది రోజులు ఆగ‌క త‌ప్ప‌దు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp