Bigg Boss 6 Telugu : ప్రతి ఏడాది బుల్లితెర ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకుంది. అలానే ఒక ఓటీటీ షో కూడా పూర్తి చేసుకుంది. త్వరలో సీజన్ 6 జరుపుకోనుండగా, దీనికి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి . సెప్టెంబర్ సాయంత్రం ఆరు గంటలకు షో మొదలు కానున్నట్టు తెలుస్తుండగా, ఈ షోకి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక బజ్‌కి శివ యాంకర్‌గా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌తో సీజన్ 6 ఆటను రంజుగా ప్లాన్ చేశారు. వారిలో 10 మంది అమ్మాయిలు కాగా.. 9 మంది అబ్బాయిలు ఉండబోతున్నారు.
వీరిలో సినిమా, టీవీ సెలబ్రీటీలు, యాంకర్లు, యూట్యూబర్స్, సోషల్ మీడియా సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా ఉండబోతుండగా.. కామన్ మెన్/ ఉమెన్ కేటగిరీలో ఇద్దరు ఉండబోతున్నారు. లాంచింగ్ రోజున 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లబోతుండగా.. మిగిలిన నలుగుర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపబోతున్నారు. ఇటీవలే ఈ సీజన్ లోగో ప్రోమోను వదిలారు. అలాగే, సీజన్ మెయిన్ ప్రోమోను రిలీజ్ చేశారు. వీటికి భారీ స్పందన కూడా దక్కింది. దీనిబట్టే ఈ సీజన్ ఎంతో కలర్‌ఫుల్‌గా సాగబోతున్నట్లు అర్థం అవుతోంది.
వాస్తవానికి బిగ్ బాస్ షోలో జరిగే తీరు మొత్తం సీక్రెట్‌గా ఉంచుతారు. కానీ, ఇందులోని ప్రతి విషయం బయటకు వస్తూనే ఉంది. దీంతో ఆరో సీజన్ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇలా ఇప్పటికే పలు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో నిర్వహకులు ఏం చేయాలో తెలియక షాక్ అవుతున్నారు. ఉదయ భాను ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో సందడి చేయనుందని అనే సరికి అందరికి దీనిపై ఆసక్తి పెరిగింది. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాలంటే, కొద్ది రోజులు ఆగక తప్పదు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.