Bigg Boss 6 Telugu sudeepa elemination here is the reasons
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో పింకీ వన్ ఆఫ్ ది క్రేజీ హౌస్ మెట్ గా వచ్చింది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో నటించిన పింకీ ఆ తర్వాత కూడా సినిమాలు చేసినా ఈమధ్య సినిమాలకు దూరంగా ఉంది. అయితే రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన ఈ అమ్మడు బిగ్ బాస్ ద్వారా మళ్లీ ఆడియన్స్ కి టచ్ లోకి రావాలని అనుకుంది. అయితే హౌజ్ లోకి వెళ్లగానే కిచెన్ తన పర్మినెంట్ ప్లేస్ గా ఫిక్స్ చేసుకుందిక్.
ఓ పక్క మెరినా.. మరోపక్క సుదీపా ఇద్దరు కిచెన్ తప్ప మిగతా పనులు చేయలేదు. హౌస్ మెట్స్ కూడా వీళ్లకి వేరే పనేమి ఇవ్వలేదు. సుదీపా ఎక్కువగా రేషన్ మేనేజర్ గా చేస్తూ వచ్చింది. ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సుదీపా హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు లీకులు వచ్చాయి. దాదాపు సుదీపానే ఎలిమినేట్ అని ఫిక్స్ అవ్వొచ్చు. ఈ క్రమంలో సుదీపా అసలు ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అన్నది చూస్తే హౌస్ లో ఆమె ఆట సరిగా ఆడలేదు. అది అందరికి తెలిసిన పాయింటే కానీ ఎవరికి తెలియని పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చామంటే అక్కడ అందరు సమానమే.. కానీ పింకీ అనబడే సుదీపా కొంతమంది హౌస్ మెట్స్ దగ్గ్గర కొంత ఈగో చూపించిందని టాక్.
Bigg Boss 6 Telugu sudeepa elemination here is the reasons
అది బయటకు చెప్పకపోయినా ఆమె మాటల్లో అర్ధమవుతుంది. నేను ఇలానే ఉంటాను.. నన్ను మీరు భరించాల్సిందే అన్న టైపు అన్న మాట. ఓ విధంగా పింకీ ఇన్ని వారాలు ఉండటమే చాలా గొప్ప విషయమని చెప్పొచ్చు. కేవలం హౌస్ మెట్స్ కి వండి పెట్టడం కోసమే బిగ్ బాస్ కి వచ్చినట్టు ఉంది పింకీ. ఆమె గేం లో ఏమాత్రం ఇంప్రెస్ చేయలేదు. అందుకే ఒకటి రెండు సార్లు ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్ ఈ వారం ఆమెని తట్టా బుట్టా ఇచ్చి ఆమె ఇంటికి పంపించేశాడు. ఏది ఏమైనా సుదీపా మాత్రం బిగ్ బాస్ కి వచ్చి నిరాశపరచిందని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టంట్స్ అయిన రేవంత్ తో పాటుగా తన ఆట తో మెప్పిస్తున్న ఫైమాతో కూడా సుదీపా తరచు గొడవలు పడుతుంది. అది కూడా ఆమెని బయటకు వచ్చేలా చేసిందని చెప్పొచ్చు.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.