Home » Entertainment » Bigg Boss 6 Telugu Title Winner Chance For Srihan And Aadi Reddy
Entertainment

Bigg Boss 6 Telugu : రేవంత్ ని దాటి శ్రీహాన్ గెలవాలంటే ఇలా చేయాల్సిందే.. ఆది రెడ్డికి టైటిల్ కొట్టే ఛాన్స్ ఉంది.. ఎలా అంటే..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: December 12, 2022, 8:00 pm
Advertisement

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకుంది. వచ్చే వారంతో బిగ్ బాస్ సీజన్ 6 ముగుస్తుంది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ రేవంత్ అని అందరు ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ నుంచి అతనే టైటిల్ గెలుస్తాడు అన్నట్టుగా ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నాయి. అయితే విన్నర్ రేవంత్ కాకూడదని అనుకునే వారు ఉన్నారు. అది మిగతా హౌస్ మెట్స్ ఫ్యాన్స్ మాత్రమే కాదు బిగ్ బాస్ కామన్ ఆడియన్స్ కూడా రేవంత్ కాకుండా ఎవరైనా సరే టైటిల్ విన్నర్ అవ్వాలని అంటున్నారు. అలా ఎందుకు అంటే అతనొక ఇండియన్ ఐడల్ విన్నర్ అతను బిగ్ బాస్ వాచ్చేప్పుడే గట్టి పి.ఆర్ టీం ని ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. బిగ్ బాస్ ఎలిమినేషన్ అంతా కూడా ఓటింగ్స్ మీదే ఆధారపడి ఉంటుంది.

Advertisement

అందుకే వీక్ మొదలు కాగానే రేవంత్ కు ఉన్న టీం అంతా అతన్ని టాప్ లో ఉంచుతూ వచ్చింది. అయితే ఇప్పుడు టైటిల్ విన్నర్ గా మాత్రం రేవంత్ గెలవకుండా కామన్ ఆడియన్స్ అంతా కూడా అతనికి దగ్గరగా ఉన్న శ్రీహాన్, ఆది రెడ్డిలకు సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ కాకుండా నెక్స్ట్ ప్లేస్ లో శ్రీహాన్ కి టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. టికెట్ టు ఫినాలే గెలిచి మొదటి టాప్ 5గా వచ్చింది కూడా అతనే. రేవంత్ కి ఉన్న ఫాలోయింగ్ బయట లేకపోయినా సిరి అండ్ టీం శ్రీహాన్ కోసం కూడా బాగానే పనిచేస్తున్నారు. బిగ్ బాస్ రివ్యూస్ చెబుతూ అందులో ఛాన్స్ తెచ్చుకున్నాడు ఆది రెడ్డి. కామన్ మెన్ గా వచ్చిన ఆది రెడ్డి టాప్ 5 దాకా నిలబడటమే గ్రేట్ అచీవ్ మెంట్ అని చెప్పొచ్చు.

Bigg Boss 6 Telugu title winner chance for srihan and aadi reddy

Advertisement

అయితే ఆది రెడ్డికి ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. వాళ్లంతా కూడా ఆది రెడ్డిని విన్ చేయాలని గట్టిగా అనుకుంటే మాత్రం ఆది రెడ్డి కూడా టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆది రెడ్డి యూట్యూబ్ సబ్ స్క్రైబర్స్, ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ అందరు అతనికి సపోర్ట్ చేసి ఓటింగ్ వేస్తే అతను పక్కా టైటిల్ గెలుస్తాడు. ఇలా రేవంత్ కి దగ్గరగా ఉన్న శ్రీహా, ఆది రెడ్డిలు కూడా టైటిల్ రేసులో ఉన్నారని చెప్పొచ్చు. అయితే వీరంతా కాకుండా కీర్తీకి కూడా బయట సింపతీ బాగానే ఉంది. ఆమె అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పొచ్చు. మరి బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ ఎవరో చూడాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి