
Allu Arjun next movie update
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఒక్క పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు బన్నీ. పుష్ప సినిమా రిలీజ్ అయ్యాక ఎక్కడ చూసినా పుష్ప సినిమాలోని పాటలు, డైలాగ్స్ నే వినపడ్డాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత ఇంతవరకు కొత్త సినిమా గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం బన్నీ తన తరువాతి సినిమా ఏంటో డిసైడ్ అయ్యాడని అంటున్నారు. మరోసారి ఆ స్టార్ డైరెక్టర్ తోనే సినిమా చేస్తున్నాడని టాక్ నడుస్తుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా సీక్వెల్ పుష్ప 2 సినిమా లో నటిస్తున్నారు. గతేడాది రిలీజ్ అయిన పుష్ప సినిమాకి రెండో భాగం ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను దక్కించుకుంది. పుష్ప 2 సినిమా 2023లో రిలీజ్ కానుంది. ఇక అందరూ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా స్టార్ డైరెక్టర్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి.
Allu Arjun next movie update
బన్నీ తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తున్నాడని సోషల్ మీడియాలో బాగా వార్తలు వస్తున్నాయి. ఇక బాలీవుడ్ నుంచి సంజయ్ లీలా బన్సాలి అల్లుఅర్జున్ ని కలిసినట్లు సమాచారం. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో కూడా బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అలాగే డైరెక్టర్ అట్లీతో కూడా సినిమా చేయబోతున్నాడు టాక్. అలాగే తెలుగులో కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. అంతేకాకుండా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను చేయబోతున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.