Bigg Boss 8 Telugu : ప్రతాపం చూపిస్తున్న కంటెస్టెంట్స్.. కొందరి కన్నీటి రాగం మాత్రం షరా మాములే..!
Bigg Boss 8 Telugu : ఈ వారం బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కరోజుకే నామినేషన్ ప్రక్రియ పూర్తైంది.ఆ తర్వాత బీబీ ఇంటికి దారేది అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా హౌస్ మేట్స్ కు కొన్ని టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. అంతకు ముందు ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న వారిని నాలుగు టీమ్ లు గా చేసి.. ఒకొక్క టీమ్ లో ముగ్గురు సభ్యులు ఉండేలా చేశాడు. బ్లూ, రెడ్, ఎల్లో అలాగే గ్రీన్ టీమ్స్ చేశాడు బిగ్ బాస్. టీమ్ రెడ్: గౌతమ్, ప్రేరణ యష్మీ.. టీమ్ బ్లూ: అవినాష్ నిఖిల్ హరితేజ.. టీమ్ గ్రీన్: తేజ, విష్ణుప్రియ, నబీల్.. టీమ్ ఎల్లో: రోహిణి, పృథ్వీ, నయని.. ఉన్నారు. యష్మీ, ప్రేరణపై నిఖిల్ ఒక మృగంలా దాడి చేసి, ఫిజికల్ అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో యష్మీ, ప్రేరణ మాట్లాడిన తీరు తలుచుకుని నిఖిల్ ఏడ్చాడు.హరితేజతో ఫిజికల్ అవ్వొద్దని గౌతమ్‌కు చెబితే.. రూల్స్ బుక్‌లో ఉందా. దమ్ముంటే నువ్ ఆడు అని విసిరేసాడు.
అక్కడ నాకు ట్రిగ్గర్ అయింది. మీకు ముందే సారీ అని చెప్పే టాస్క్ స్టార్ట్ చేశాను. నువ్ ఏడవటం ముందు నేను వినలేదు. నేను ఎప్పుడైతే విన్నానో అప్పుడే ఆపేసి ప్రేరణని లాగాను. కానీ, నేను ఏం చేయకముందే బ్లడీ అని ప్రేరణ అందు. ఎఫ్ వర్డ్ యూజ్ చేసింది అని యష్మీతో నిఖిల్ చెప్పుకున్నాడు. టాస్క్ లో భాగంగా ప్రతి టీమ్ నుంచి ఇద్దరూ సభ్యులు వచ్చి.. ఒకరి తర్వాత ఒకరు. నెల పై ఉన్న మాట్రిస్ ని పరిగెత్తుకుంటూ వచ్చి దాని పైకి దూకి ముందుకు నెట్టాలి అలా ఎవరైతే ముందుగా ఆ మాట్రిస్ ను లైన్ దాటిస్తారో వాళ్లు విన్ అయినట్టు అని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో అందరూ కష్టపడి ఆడారు.అయితే బ్లూ టీమ్ లో ఉన్న అవినాష్, నిఖిల్ ఈ గేమ్ లో విన్ అయ్యారు. అయితే ఎల్లో టీమ్ నుంచి ఈ గేమ్ ఆడటానికి నయని, అలాగే పృథ్వీ వచ్చారు.
Bigg Boss 8 Telugu : ప్రతాపం చూపిస్తున్న కంటెస్టెంట్స్.. కొందరి కన్నీటి రాగం మాత్రం షరా మాములే..!
అయితే నయని గేమ్ గురించి రోహిణి మాట్లాడింది. దాంతో ఈ ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. రోహిణి తనకు చెప్పడం, చెప్పే విధానం తనకు నచ్చలేదు అంటూ నయని సీన్ క్రియేట్ చేసింది. అసలే హౌస్ లో క్రై బేబీ గా పేరు తెచ్చుకున్న ఈ చిన్నది మరోసారి ఏడుపు మొదలు పెట్టింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది. ప్రతి చిన్నదానికి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది ఆమె గేమ్ స్ట్రాటజీనో లేక నిజంగానే ఆమె ఏడుస్తుందో ప్రేక్షకులకు అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు. ఇక గేమ్ తర్వాత నా టీం మేట్ అలా ఎలా అంటుంది.. నా వల్లే టీం ఓడిపోయిందని ఎలా అంటుంది అంటూ నయని ఏడుపు రాగం అందుకోగా, రోహిణి ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక నిఖిల్, యష్మీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇలా తాజా ఎపిసోడ్‌లో ఏడుపు రాగం ఎక్కువైంది.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.