Giloy Leaves : మన పరిసర ప్రాంతంలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వాటిని మనం పిచ్చి మొక్కలు అని అనుకుంటూ ఉంటాం. కానీ వాటిలో కూడా మన ఆరోగ్యా నికి మేలు చేసే ఎన్నో మొక్కలు ఉన్నాయి. వాటిలలో ఒకటి తిప్పతీగ. ఆయుర్వేద ప్రకారం చూస్తే,ఈ మొక్కను అమృతంతో పోలుస్తారు. అలాగే ఈ తిప్పతీగలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అలాగే ఈ తీగలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇది కణాలను ఎంతో ఆరోగ్యంగా మారుస్తుంది. అంతేకాక ఫ్రీ రాడికల్స్ ను మరియు వ్యాధి కలిగించే క్రిములను అరికట్టడంలో ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇకపోతే ఈ తిప్ప తీగ రసం తాగితే రోగనిరోధక శక్తి అనేది ఎంతో పెరుగుతుంది. అలాగే జ్వరం నుండి ఉపశమనం పొందాటానికి ఈ తిప్పతీగ ఆకులు బాగా హెల్ప్ చేస్తాయి…
ఈ తిప్పతీగను ఇతర రూపాలలో తీసుకుంటే ఇన్ఫెక్షన్ నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ తీగ శరీరంలోని టాక్సిన్స్ ను కూడా తొలగిస్తుంది. అంతేకాక రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అలాగే యుటిఐ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే ఈ తీగ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ తీగతో గ్యాస్ మరియు మలబద్ధకం, ఎసిడిటీ లాంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఈ ఆకులను ప్రతిరోజు ఖాళీ కడుపుతో నమలి తీసుకోవడం వలన జీర్ణక్రియ ఎంతో మెరుగుపడుతుంది. ఈ తిగ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఒత్తిడిని తగ్గించి ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతాయి. దీని వలన డయాబెటిస్ నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ తీగలో యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది శ్వాస వ్యవస్థను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ తీగను ఇతర రూపాలలో తీసుకుంటే జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు…
ఈ తిప్ప తీగను అడాప్టోజెనిక్ హెర్బ్ గా కూడా వాడవచ్చు. ఈ తీగ మానసిక ఆరోగ్యాన్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అంతేకాక ఒత్తిడిని కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే ఆందోళనను కూడా దూరం చేస్తుంది. ఈ తీగ యొక్క రసాన్ని తాగితే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో గుండె పనితీరు ఎంతో మెరుగుపడుతుంది. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకు ఎదురయ్యే ఒత్తిడి దూరం చేయడంలో కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే శరీరంలో పేర్కొన్నటువంటి విష పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది. అంతేకాక మహిళలకు 45 ఏళ్లు దాటిన తర్వాత ఎముకలు ఎంతో బలహీనంగా మారతాయి. అందుకే ఈ రసాన్ని తాగితే మహిళల్లో వచ్చే బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఈ తిప్పతీగను రసం రూపంలో తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు
Ginger Hair Fall : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే సమస్యలలో జుట్టు రాలే సమస్య కూడా…
Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఆమె వెండితెర మీద…
Bigg Boss 8 Telugu : ఈ వారం బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కరోజుకే నామినేషన్ ప్రక్రియ పూర్తైంది.ఆ…
Skin Care : సాధారణంగా ప్రతి ఒక్కరికి మోచేతులపై మరియు మోకాళ్లపై నలుపు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే మన శరీరం…
Post Office : సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
Health Benefits : మన శరీరానికి జామ ఎంత మేలు చేస్తుందో మన అందరికీ తెలిసినదే. కానీ ఈ జామ…
Zodiac Signs : ఈనెల 31వ తేదీ అమావాస్య రోజున దీపావళి పండుగ వస్తుంది. అలాగే ఈనెల 31 నవంబర్…
Kavya Maran : మరి కొద్ది రోజులలో ఐపీఎల్ మొదలు కానుంది. దీని కోసం ఆటగాళ్లని కొనుగోలు చేసే ప్రక్రియ…
This website uses cookies.