Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!
ప్రధానాంశాలు:
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో నాగమణికంఠ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్బాస్ 8లోకి అడుగు పెట్టిన మణికంఠ.. తొలివారం నుంచే తన ఫ్యామిలీ స్టోరీని.. చెబుతూ.. సింపథి స్టార్ ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు. తన భార్య, కూతురి గురించి స్పెషల్ వీడియోలో ఒకలా.. హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత మరోలా మాట్లాడి.. నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు.
బిగ్బాస్ లోకి రావడానికి తన భార్యే కారణమని.. షాపింగ్ చేయమని డబ్బులు కూడా పంపించిందంటూ హౌస్ లో చెప్పుకొచ్చాడు. కానీ రెండో వారం లో మాత్రం హౌస్ లో ఉన్న లేడీ సభ్యులను హగ్ చేసుకోవడం , ముద్దులు పెట్టుకోవడం చేస్తూ వీడు చాల డేంజర్ అనిపించుకుంటున్నాడు. విష్ణుప్రియ, యాష్మి విషయంలో ఇదే చేసాడు. విష్ణుప్రియ అయితే మణికంఠ చాల డేంజర్ అని..మనకు దగ్గరై.. మన వీక్నెస్ పాయింట్స్ పట్టుకొని నామినేషన్ లో వేస్తున్నాడని తెలిపింది.
Bigg Boss 8 Telugu యష్మీ విషయంలో మణికంఠ ప్లాన్..
ఇక యాష్మి విషయంలో కూడా ఇదే చేసాడు. ఫ్రెండ్ షిప్ పేరుతో మోసం చేసావు..నేను ఈ హౌస్ లో ఉన్నన్ని రోజూ నిన్ను నామినేషన్ చేస్తా అని తేల్చి చెప్పింది. ఇక ప్రేరని , సోనియా లను కూడా వదల్లేదు. గట్టిగా కౌగిలించుకోవడం , ముద్దులు పెట్టుకోవడం వంటి చేసి ఛీ అనిపించుకున్నాడు.
మణికంఠ వల్ల యాష్మి చాల ఇబ్బంది పడింది..ఒకానొక సమయంలో నేను హౌస్ లో ఉండలేను బిగ్ బాస్ అంటూ తెలిపింది. నిన్న రాత్రి కూడా విష్ణుప్రియ దగ్గరికి వెళ్లి కౌగిలించుకోబోయాడు..కానీ విష్ణు గట్టి కౌంటర్ ఇచ్చింది.కంటెంట్ కోసం ఇలా నువ్వు చేస్తున్నావు అంటూ తెలిపింది. ఓవరాల్ గా మాత్రం మణికంఠ హౌస్ లో రెచ్చిపోతున్నాడు. మరి నాగ్ ఏమైనా క్లాస్ తీసుకుంటాడా..లైట్ తీసుకుంటాడా అనేది చూడాలి.