Bigg Boss Ariyana : బిగ్ బాస్‌తో ఫుల్ గా సంపాదిస్తున్న అరియనా.. BB కేఫ్ కి ఈమె పారితోషికం ఎంతంటే..!
Bigg Boss Ariyana : తెలుగు బిగ్ బాస్ రెగ్యులర్ సీజన్ తో పాటు ఓటీటీ సీజన్ లో కనిపించిన కొద్ది మందిలో అరియానా ఒకరు. ఈమెకు బిగ్ బాస్ అంటే విపరీతమైన పిచ్చి అనడంలో సందేహం లేదు. రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేయడం ద్వారా వచ్చిన పాపులారిటీ తో బిగ్ బాస్ లో ఈ అమ్మడు అవకాశం దక్కించుకుంది. రామ్ గోపాల్ వర్మ ఈమెకు మద్దతుగా ఉండటం వల్లే బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ లో ఈసారి లేకున్నా కూడా బిగ్ బాస్ బజ్ అంటూ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఈమె బిగ్ బాస్ టీమ్ లోనే ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
అరియానా ప్రస్తుతం బిబి కేఫ్ అంటూ ఒక కార్యక్రమంను నిర్వహిస్తుంది. స్టార్ మా వారు స్వయంగా బిగ్ బాస్ రివ్యూ ను అరియానా తో ఇప్పిస్తున్నారు. సాధారణంగా అయితే ముద్దుగుమ్మ అరియానా యొక్క పద్దతికి ఈ షో సెట్ అవ్వదు. కానీ తనకు బిగ్ బాస్ పై ఉన్న ఆసక్తి తో షో ను చేసేందుకు ఒప్పుకుంది. గత సీజన్ లో అరియానా బజ్ యొక్క యాంకర్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఈసారి బిబి కేఫ్ అనే కార్యక్రమంకు హోస్ట్ గా చేస్తోంది. బిగ్ బాస్ పై జనాల్లో ఆసక్తి కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బిగ్ బాస్ లో ఉన్న వారి యొక్క బంధువులు మరియు మాజీ బిబి కంటెస్టెంట్స్ తో అరియానా ఈ కార్యక్రమం చేస్తోంది.

bigg boss ariyana new show remuneration
బిగ్ బాస్ కి ముందు అరియానా ఒక నార్మల్ సెలబ్రెటీ.. కానీ ఇప్పుడు అరియానా ఏ స్థాయి సెలబ్రేటీనో అందరికి తెల్సిందే. ఆమె రోజు వారి సంపాదన భారీ ఎత్తున పెరిగింది. ఒక మీడియం రేంజ్ హీరోయిన్ కంటే కూడా ఈమె అధికంగా సంపాదిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. బిబి కేఫ్ షో కి ఒక్కో ఎపిసోడ్ కి ఆమె తీసుకునే పారితోషికం నిజంగా ఆశ్చర్యం ను కలిగిస్తుంది. ప్రతి రోజు ఆమె ఈ ఎపిసోడ్ లను చేయాల్సి ఉంటుంది. కనుక ఈ బిగ్ బాస్ పూర్తి అయ్యే ప్పటికి కంటెస్టెంట్స్ కంటే కూడా అరియానా ఎక్కువగా సంపాదిస్తుంది అంటూ కొందరు విశ్లేషకులు అంటున్నారు. అరియానా కు బిగ్ బాస్ తో భారీగా కలిసి వస్తుందని అంటున్నారు.