Bigg Boss Ariyana : బావని చాలా ప్రేమించా.. కాని మోస‌పోయాను అంటూ క‌న్నీరు పెట్టిన అరియానా | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Bigg Boss Ariyana : బావని చాలా ప్రేమించా.. కాని మోస‌పోయాను అంటూ క‌న్నీరు పెట్టిన అరియానా

Bigg Boss Ariyana : యాంక‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన అరియానా బిగ్ బాస్ షోతో మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. టాప్ 5లో ఒక‌రిగా స్థానం ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం నాన్‌స్టాప్ షోలో పాల్గొంటుంది. తాజా ఎపిసోడ్ లో ‘తలుపుతట్టిన తొలి ప్రేమ’ అంటూ వారి వారి తొలి ప్రేమ గుట్టుని బయటకు లాగారు బిగ్ బాస్. దానిలో భాగంగా.. అరియానా తన తొలి ప్రేమ అనుభవాలను పంచుకుని ఎమోషనల్ అయ్యింది.త‌న ల‌వ్ స్టోరీ తొమ్మిదో త‌ర‌గ‌తిలోనే […]

 Authored By sandeep | The Telugu News | Updated on :10 April 2022,11:00 am

Bigg Boss Ariyana : యాంక‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన అరియానా బిగ్ బాస్ షోతో మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. టాప్ 5లో ఒక‌రిగా స్థానం ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం నాన్‌స్టాప్ షోలో పాల్గొంటుంది. తాజా ఎపిసోడ్ లో ‘తలుపుతట్టిన తొలి ప్రేమ’ అంటూ వారి వారి తొలి ప్రేమ గుట్టుని బయటకు లాగారు బిగ్ బాస్. దానిలో భాగంగా.. అరియానా తన తొలి ప్రేమ అనుభవాలను పంచుకుని ఎమోషనల్ అయ్యింది.త‌న ల‌వ్ స్టోరీ తొమ్మిదో త‌ర‌గ‌తిలోనే స్టార్ట్ అయిన‌ట్టు చెప్పింది.. నాకు చిన్నప్పటి నుంచి డాడీ లేరు. సో అబ్బాయిలతో ఎలా ఉండాలో తెలియదు. ఆ అబ్బాయి నాతో మాట్లాడగానే ఆ కేరింగ్ బాగా నచ్చేది నాకు. ఇంట్లో లవ్ అనేది పూర్తిగా తెలియదు కానీ.. అప్పటికే స్టార్ట్ అయిపోయింది.. మంచిగా మాట్లాడుకున్నాం.కొన్నాళ్లకి ఇంట్లోంచి బయటికి వచ్చేశా ఇంటర్ పూర్తి అయ్యేసరికి.

అప్పుడే మా బావది కూడా డిగ్రీ అయిపోయింది. ఇద్దరం చాలా డీప్‌గా ఉన్నాం చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాం కానీ.. ఎక్కడో ఒక టైమ్‌కి బోర్ కొడతారు అంటారు కదా..ఇప్పుడు నాకు అర్థమవుతుంది అప్పుడు అర్థం కాలేదు కానీ.. మేబీ తనకి తన స్పేస్ కావాల్సి వచ్చిందేమో ఆ టైమ్‌కి.ఒక రోజు ఏం అయ్యిందంటే నేను చూడరానిది ఒకటి చూశాననిమాట. అది చూసిన తర్వాత నేను కలలో కూడా అనుకోలేదు అక్కడ నా హార్ట్ అంత బ్రేక్ అవుతుందని. నేను ఏం చూశాను అనేది ప్రపంచానికి కూడా చెప్పుకోలేను.. నా పరిస్థితి అలాంటిది. ఇక నేను నా కెరీర్ బిల్డ్ చేసుకునే స‌మ‌యంలో అబ్బాయి పరిచయం అయ్యారు. దాంతో తనకి నా మీద అనుమానం మొదలైంది. ప్రామిస్‌గా ఇది కచ్చితంగా మిస్ అండర్‌స్టాండింగ్‌నే.. ఎందుకంటే ఒకవేళ అదే నిజమైతే నా జీవితం మరోలా ఉండేది కదా? ఇక మా బావతో అనుమానాలు వద్దులే అనుకుని బ్రేకప్ చెప్పి బయటికి వచ్చేశాను.

Bigg Boss ariyana shares break up story

Bigg Boss ariyana shares break up story

Bigg Boss Ariyana : పాపం అరియానా..

అన్ని రోజులు నన్ను చూసుకున్నాడు కదా.. అన్ని పైసలు ఖర్చు పెట్టిండు కదా.. నాకు కూడా ఇవ్వాలని ఉండే.. నేను కూడా సంపాదిస్తున్నా ఇప్పుడు నేను కూడా ఆ స్టేజ్‌కి వచ్చేసినా అని.. అది రిజెక్ట్ అయిపోయింది. సుమారుగా ఏడు ఎదిమిది సంవత్సరాల రిలేషన్ షిప్ అవ్వలేదంతే.. ఇప్పుడు ఒకవేళ వచ్చినా సరే నాకు వద్దు ఇక.. ఎందుకంటే నేను ఇంత స్ట్రాంగ్ అయ్యాను.. ఇప్పుడు నేను ఉండలేను.. బావా ఆనంద్.. ఇప్పటికీ నేను కాల్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటాను..ఇప్పుడు వచ్చినా ఏం చేస్తానో తెలియదు.. అయిపోయింది ఇంక అంతే..’ అంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీ చెబుతూ గుండెలు బ‌ద్ద‌లయ్యేలా ఏడ్చింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది