Bigg Boss 7 Telugu : పల్లవి ప్రశాంత్, రతిక లవ్ కన్ఫమ్ చేసిన బిగ్ బాస్.. డీప్‌ లవ్‌లో ఇద్దరూ.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారా?

Advertisement

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ.. హౌస్ లో అడుగు పెట్టిన ఒక్క రోజులోనే రతిక, ప్రశాంత్ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నిజానికి.. రతిక ఇప్పటికే లవ్ ఫెయిల్యూర్. తన లవ్ ఫెయిల్ అయిందని బిగ్ బాస్ స్టేజీ మీదనే తొలి రోజే నాగార్జునకు చెప్పేసింది. తాజాగా ఎపిసోడ్ లోనూ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడని చెప్పింది. ఓవైపు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూనే మరోవైపు ప్రశాంత్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. పల్లవి ప్రశాంత్ తో కలిసి రొమాన్స్ చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఒక వైపు ఉంటే.. పల్లవి ప్రశాంత్, రతిక ఒక వైపు ఉంటారు. ఎక్కడికెళ్లినా ఇద్దరే. కలిసే అన్నం తింటారు. అన్ని పనులు కలిసే చేస్తున్నారు. తొలి రోజు నుంచి వీళ్లిద్దరూ చేసే పనే ఇది. అందుకే పల్లవి ప్రశాంత్, రతిక ఇద్దరూ లవ్ లో ఉన్నట్టు మిగితా కంటెస్టెంట్లు కూడా కన్ఫమ్ చేసుకున్నారు.

Advertisement

అయితే.. తాజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ కూడా వీళ్ల లవ్ ను కన్ఫమ్ చేశాడంటే వీళ్ల లవ్ ఎంత దూరం వెళ్లిందో తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే వీళ్లది ఉత్తుత్తి లవ్ అయితే అస్సలు కాదు. శివాజీ బిగ్ బాస్ పై ఫైర్ అవడంతో బీపీ చెక్ చేసుకోవాలంటూ ఒక బీపీ మిషన్ ను పంపిస్తాడు బిగ్ బాస్. దీంతో శివాజీకి ఇంకాస్త చిర్రెత్తుకొస్తుంది. రతిక బీపీ మిషన్ ను తీసుకొని చెవుల్లో పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ప్రశాంత్ వచ్చి నా బీపీ చెక్ చేయి అంటాడు. దీంతో అతడి గుండె మీద స్కెతస్కోప్ ను పెడుతుంది రతిక. దీంతో బిగ్ బాస్ వెంటనే లైన్ లోకి వచ్చి రతిక.. ప్రశాంత్ గుండె ఏం చెబుతోంది అని అడుగుతాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ రతిక, రతిక అంటోంది అంటూ ఒక్కసారిగా లొల్లి చేస్తారు. రతిక, రతిక అని అంటోంది బిగ్ బాస్ అంటూ డైరెక్ట్ గా చెప్పేస్తుంది రతిక.

Advertisement
Bigg Boss 7 Telugu confirms love of pallavi prashanth and rathika rose
Bigg Boss 7 Telugu confirms love of pallavi prashanth and rathika rose

Bigg Boss 7 Telugu : రతికే ప్రశాంత్ ను ఫ్లర్ట్ చేస్తోందా?

అయితే.. ఇక్కడ గమనిస్తే ప్రశాంత్ కంటే కూడా ఎక్కువగా రతికే అతడిని ఫ్లర్ట్ చేయటానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అసలు ఇది రతిక టాస్కా లేక నిజంగానే ప్రశాంత్ మీద ఇష్టంతో ఇలా చేస్తోందా మాత్రం అర్థం కావడం లేదు. వాళ్ల లవ్ ను బిగ్ బాస్ కూడా కన్ఫమ్ చేయడం అనేది చూస్తుంటే ఇందులో ఏదో మతలబు ఉన్నట్టే అనిపిస్తోంది. అతడి గుండె ఏం చెబుతోంది అని బిగ్ బాస్ అడిగితే రతిక, రతిక అంటోంది అంటూ రతికే చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రశాంత్ కంటే ఎక్కువగా తనే ప్రశాంత్ కి లైన్ వేయడానికి ప్రయత్నిస్తోంది అంటే.. ఖచ్చితంగా అది గేమ్ లో ఒక భాగం అయి ఉండొచ్చు. లేదా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అయి ఉండొచ్చు. లేదంటే నిజంగానే ప్రేమ అయి ఉండొచ్చు. అదేంటో తెలియాలంటే మాత్రం వీకెండ్ దాకా ఆగాల్సిందే.

Advertisement
Advertisement