Bigg Boss Faima : కెప్టెన్ అయితే నాకు అన్యాయం చేస్తారా.. హౌస్ మెట్స్ తొక్కేస్తున్నరంటూ ఫైమా కామెంట్స్.. నెటిజెన్ల రియాక్షన్ ఏంటంటే..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: November 17, 2022, 9:39 pm

Bigg Boss Faima : బిగ్ బాస్ సీజన్ 6 లో 11వ వారం కెప్టెన్సీ టాస్క్ లో బీబీ ట్రన్స్ పొర్ట్ అనే వెహికల్ ఏర్పాటు చేసి హౌస్ మెట్స్ అంతా కూడా బజర్ మోగినప్పుడు ఎవరైతే వచ్చి ఆ లారీ హార్న్ మోగిస్తారో వారు హౌస్ మెట్స్ ఎవరైతే కెప్టెన్ గా అర్హత లేదని భావిస్తారో వారి నుంచి ఒకరిని కెప్టెన్సీ అర్హత లేదని తేల్చే చాన్స్ ఉంది. బీబీ ట్రాన్స్ పోర్ట్ లో మొదట హార్న్ కొట్టి ఆది రెడ్డి కెప్టెన్సీ కంటెండర్ అవగా ఆ టైం లో మొదటి రౌండ్ లోనే ఫైమాని కెప్టెన్సీ అర్హత లేదని నిర్ణయించారు. దానికి కారణం ప్రస్తుతం ఇంటి కెప్టెన్ గా ఫైమా ఉన్ననుకే.

అయితే ఆ టాస్క్ జరుగుతున్న టైం లో ఫైమా తన అసంతృప్త్ని వ్యక్తపరచింది. ఒకసారి కెప్టెన్ అయితే మరోసారి అవ్వకూడదు అన్న రూల్ ఏమైనా ఉంద లేదు కదా మరి ఎందుకు తనని ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ కాకుండా చేశారంటూ చెప్పుకొచ్చింది. అందరు కలిసి తనని తొక్కేస్తున్నారని అంటుంది ఫైమా. 11 వారాలుగా అన ఆట తీరుతో అందరిని మెప్పిస్తూ వచ్చిన ఫైమా టాప్ 5 లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆట తీరు బాగానే ఉన్నా ఆమె మాట తీరు మాత్రం కొంతమేరకు అభ్యంతరాలు వచ్చేలా చేస్తుంది.

Bigg Boss Faima comments on housemates

Bigg Boss Faima comments on housemates

ముఖ్యంగా ఫైమా, ఇనయాల మధ్య ఫైట్ ఆసక్తి కరంగా ఉంది. హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టంట్స్ లో ప్రతి టాస్క్ లో ఫైమా తన ఆట తీరుతో మెప్పిస్తూ వస్తుంది. అడపాదడపా రేవంత్ తో కూడా ఫైమా పోట్లాడుతుంది. ఇక ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ గా ఆది రెడ్డి, రోహిత్, ఇనయా, శ్రీహాన్ లు ఉన్నారు. ఈ వారం కెప్టెన్ ఎవరన్నది ఈరోజు తెలుస్తుంది. మరో మూడు వారాలు మాత్రమే ఉన్న బిగ్ బాస్ సీజన్ 6లో టైటిల్ విన్నర్ ఎవరన్నది ఇప్పటికే నిర్ణయించారు ఆడియన్స్.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp