Hari Teja : జీవితంలో సరిపోనివి ఇవే.. బిగ్ బాస్ ఫేమ్ హరితేజ కామెంట్స్
Hari Teja : బిగ్ బాస్ ఇంట్లో ఉండి వచ్చిన కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అయితే చాలా మందికి మంచి ఇమేజ్ వస్తుంది. కానీ కొంత మందికి మాత్రమే కాలం కలిసిరాక.. నెగెటివ్ ఇమేజ్ చుట్టుకుంటూ ఉంటుంది. కానీ హరితేజకు మాత్రం బిగ్ బాస్ షో లైఫ్ టర్నింగ్ అని చెప్పాలి. అప్పటి వరకు విలన్‌గా మాత్రమే జనాలు బుల్లితెరపై హరితేజను చూశారు.
కానీ హరితేజలోని కామెడీ యాంగిల్, హ్యూమర్‌ను బిగ్ బాస్ షో బయటకు తీసుకొచ్చింది. అలాంటి హరితేజ బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకోవడంతో పాటు.. ఎన్నో మంచి ప్రాజెక్ట్‌లలో కామెడీ పాత్రలను దక్కించుకుంది. ఇప్పుడు హరితేజ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఈ మధ్యే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది హరితేజ
Hari Teja : షాపింగ్‌పై హరితేజ సెటైర్లు..
భూమి అంటూ నామకరణం చేసింది కూడా. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హరితేజ తాజాగా ఓ కామెంట్ చేసింది. ఆడవాళ్ల షాపింగ్ గురించి సెటైర్లు వేసింది. ఎన్ని కొనుక్కున్నా కూడా జడ రబ్బర్లు, పిన్నులు, బొట్టు పిల్లలు మాత్రం ఎప్పుడూ కొంటూనే ఉంటారు. వాటి గురించి చెబుతూ.. ఎంత తీసుకున్నా సరిపోనివి ఇవే అనుకుంటా జీవితంలో అని కౌంటర్లు వేసింది.