
Bigg Boss : బిగ్ బాస్ విన్నర్‌పై కోడిగుడ్లతో దాడి.. పెద్ద రచ్చే అయిందిగా..!
Bigg Boss : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని ప్రాంతీయ భాషలలో ఈ షో సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ముందుగా ఈ షో హిందీలో మొదలు కాగా, ఆ తర్వాత సౌత్‌లోని పలు భాషలలో సందడి చేస్తుంది. ఇటీవల హిందీలో బిగ్ బాస్ సీజన్ 17 గ్రాండ్ గా ఫినిష్ అయింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ బిగ్ బాస్ సీజన్ 17లో స్టాండప్ కమెడియన్, ర్యాపర్ అయిన మునావర్ ఫరూఖీ ట్రోఫీ గెలుచుకున్నారు. అతని పుట్టిన రోజునే ఈ బిగ్ బాస్ టైటిల్ అందుకోవడం విశేషంగా చెప్పాలి. ఫైనల్స్‌లో అరుణ్ మాషెట్టి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగా, ఆ తర్వాత అంకితా లోఖండే, మన్నరా చోప్రా కూడా ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యారు.
చివరికి హౌజ్‌లో మునావర్ ఫరూఖీ, అభిషేక్ కుమార్ మాత్రమే హౌజ్‌లో మిగిలారు. ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ ఫైనల్‌గా బిగ్ బాస్ సీజన్ 17 విన్నర్‌గా మునావర్ ఫరూఖీని విన్నర్ గా ప్రకటించారు.. మునావర్ ఫరూఖీ బిగ్ బాస్ 17 ట్రోఫీతో పాటు రూ. 50 లక్షలు, హ్యుందాయ్ క్రెటా కారును బహుమతిగా అందుకున్నాడు. అయితే మనోడు ఇటీవల వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. ఆ మధ్య ముంబైలోని బోరా బజార్‌లో ఉన్న ఓ హుక్కా పార్లర్‌పై ముంబై పోలీసులు రాత్రి రైడ్ చేయగా.. ఈ రైడ్‌లో హుక్కా తాగుతున్నట్లు గుర్తించిన 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో మునావర్ ఫరూఖీ కూడా ఉన్నారు. ఫరూఖీపై ‘కోప్టా’ 2003 చట్టం కింద కేసు నమోదు చేసిన తర్వాత అతడిని విడిచిపెట్టారు.
Bigg Boss : బిగ్ బాస్ విన్నర్‌పై కోడిగుడ్లతో దాడి.. పెద్ద రచ్చే అయిందిగా..!
ఇక ఓ గొడవలో అతనిపై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇక తాజాగా అతనిపై కోడి గుడ్ల దాడి జరిగింది. రంజాన్ సందర్భంగా ముంబై మొహమ్మద్ అలీ రోడ్ లో ఓ ఇఫ్తార్ పార్టీకి మునావర్ ని ఆహ్వానించారు. అయితే అతను తనని పిలిచిన రెస్టారెంట్‌కి కాకుండా వేరే రెస్టారెంట్‌కి ఇఫ్తార్ పార్టీకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆ క్రమంలో స్వీట్స్ తీసుకెళదామని ఓ స్వీట్ షాప్‌కి వెళ్లగా, అక్కడ మునావర్ ఫరూఖీని పార్టీకి పిలిచిన రెస్టారెంట్ యజమాని, అతని షాప్ లో పనిచేసే వాళ్ళు కోడిగుడ్లతో మునావర్ పై దాడి చేశారు. దీంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. మునావర్‌కూడా వారితో గొడవ పడ్డట్టు తెలుస్తుంది. మొన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
This website uses cookies.