Bigg Boss : బిగ్ బాస్ విన్న‌ర్‌పై కోడిగుడ్లతో దాడి.. పెద్ద ర‌చ్చే అయిందిగా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Bigg Boss : బిగ్ బాస్ విన్న‌ర్‌పై కోడిగుడ్లతో దాడి.. పెద్ద ర‌చ్చే అయిందిగా..!

Bigg Boss : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో ఈ షో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ముందుగా ఈ షో హిందీలో మొద‌లు కాగా, ఆ త‌ర్వాత సౌత్‌లోని ప‌లు భాష‌ల‌లో సంద‌డి చేస్తుంది. ఇటీవ‌ల హిందీలో బిగ్ బాస్ సీజన్ 17 గ్రాండ్ గా ఫినిష్ అయింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ బిగ్ బాస్ సీజన్ 17లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 April 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss : బిగ్ బాస్ విన్న‌ర్‌పై కోడిగుడ్లతో దాడి.. పెద్ద ర‌చ్చే అయిందిగా..!

Bigg Boss : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో ఈ షో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ముందుగా ఈ షో హిందీలో మొద‌లు కాగా, ఆ త‌ర్వాత సౌత్‌లోని ప‌లు భాష‌ల‌లో సంద‌డి చేస్తుంది. ఇటీవ‌ల హిందీలో బిగ్ బాస్ సీజన్ 17 గ్రాండ్ గా ఫినిష్ అయింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ బిగ్ బాస్ సీజన్ 17లో స్టాండప్ కమెడియన్, ర్యాపర్ అయిన మునావర్ ఫరూఖీ ట్రోఫీ గెలుచుకున్నారు. అతని పుట్టిన రోజునే ఈ బిగ్ బాస్ టైటిల్ అందుకోవ‌డం విశేషంగా చెప్పాలి. ఫైనల్స్‌లో అరుణ్ మాషెట్టి బిగ్ బాస్ హౌస్ నుండి బ‌య‌ట‌కు రాగా, ఆ తర్వాత అంకితా లోఖండే, మన్నరా చోప్రా కూడా ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss : కోడిగుడ్ల‌తో దాడి..

చివ‌రికి హౌజ్‌లో మునావర్ ఫరూఖీ, అభిషేక్ కుమార్ మాత్రమే హౌజ్‌లో మిగిలారు. ఈ ఇద్దరి మ‌ధ్య‌ గట్టి పోటీ ఉన్న‌ప్ప‌టికీ ఫైనల్‌గా బిగ్ బాస్ సీజన్ 17 విన్నర్‌గా మునావర్ ఫరూఖీని విన్నర్ గా ప్రకటించారు.. మునావర్ ఫరూఖీ బిగ్ బాస్ 17 ట్రోఫీతో పాటు రూ. 50 లక్షలు, హ్యుందాయ్ క్రెటా కారును బహుమతిగా అందుకున్నాడు. అయితే మ‌నోడు ఇటీవ‌ల వివాదాలతో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఆ మ‌ధ్య ముంబైలోని బోరా బజార్‌లో ఉన్న ఓ హుక్కా పార్లర్‌పై ముంబై పోలీసులు రాత్రి రైడ్ చేయ‌గా.. ఈ రైడ్‌లో హుక్కా తాగుతున్నట్లు గుర్తించిన 14 మంది నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. అందులో మునావర్ ఫరూఖీ కూడా ఉన్నారు. ఫరూఖీపై ‘కోప్టా’ 2003 చట్టం కింద కేసు న‌మోదు చేసిన తర్వాత అతడిని విడిచిపెట్టారు.

Bigg Boss బిగ్ బాస్ విన్న‌ర్‌పై కోడిగుడ్లతో దాడి పెద్ద ర‌చ్చే అయిందిగా

Bigg Boss : బిగ్ బాస్ విన్న‌ర్‌పై కోడిగుడ్లతో దాడి.. పెద్ద ర‌చ్చే అయిందిగా..!

ఇక ఓ గొడ‌వ‌లో అత‌నిపై పోలీసు కేసు కూడా న‌మోదైంది. ఇక తాజాగా అతనిపై కోడి గుడ్ల దాడి జరిగింది. రంజాన్ సంద‌ర్భంగా ముంబై మొహమ్మద్ అలీ రోడ్ లో ఓ ఇఫ్తార్ పార్టీకి మునావర్ ని ఆహ్వానించారు. అయితే అత‌ను త‌న‌ని పిలిచిన రెస్టారెంట్‌కి కాకుండా వేరే రెస్టారెంట్‌కి ఇఫ్తార్ పార్టీకి వెళ్ళడానికి సిద్ధ‌ప‌డ్డాడు. ఆ క్ర‌మంలో స్వీట్స్ తీసుకెళ‌దామ‌ని ఓ స్వీట్ షాప్‌కి వెళ్ల‌గా, అక్క‌డ మునావర్ ఫరూఖీని పార్టీకి పిలిచిన రెస్టారెంట్ యజమాని, అతని షాప్ లో పనిచేసే వాళ్ళు కోడిగుడ్లతో మునావర్ పై దాడి చేశారు. దీంతో ప‌రిస్తితి ఉద్రిక్తంగా మారింది. మునావ‌ర్‌కూడా వారితో గొడవ ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. మొన్న రాత్రి జరిగిన ఈ ఘ‌ట‌న‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది