
Bigg Boss ariyana shares break up story
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతుంది. తెలుగు ప్రేక్షకులు మరో సారి బిగ్బాస్ ను ఈ స్థాయి లో ఆదరిస్తారని అనుకోలేదు. ఊహించకుండా ఇంతటి సక్సెస్ దక్కింది. బిగ్ బాస్ లో ఈ సారి పాత కొత్తల కలయిక లో కంటెస్టెంట్స్ ఉన్న విషయం తెలిసిందే. మొదట కంటెస్టెంట్స్ విషయం లో విమర్శలు ఎదురయ్యాయి. కానీ పోను పోను వారి యొక్క ప్రవర్తన మరియు వారి యొక్క ఎంటర్టైన్మెంట్ నచ్చి ప్రేక్షకులు వారికి కనెక్ట్ అవుతున్నారు.
ముఖ్యంగా యాంకర్ శివ నీ తీసుకుంటే మొదట ఇతడు ఎందుకు అన్నట్టుగా ప్రతి ఒక్కరు భావించారు. కానీ అతడు ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి ఎంటర్ టైన్ మెంట్ ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బిందుమాధవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ గా కనిపిస్తూనే తనదైన శైలిలో ఆటలు ఆడుతూ వస్తుంది. ఇక ఇంతకు ముందు సీజన్లో టాప్ 5 లో నిలిచిన అరియానా ఈసారి కూడా ఉండటంతో కచ్చితంగా ఫైనల్ వరకు పోతుందని.. ఈసారి ట్రోఫీని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ ప్రతి ఒక్కరు మొన్నటి వరకు భావించారు.
Bigg Boss OTT Telugu nonstop ariyana not doing well last two weeks
కానీ ఈ మూడు నాలుగు వారాలుగా ఆమె ప్రవర్తన విమర్శలకు తావిస్తోంది. ఆమె ప్రతి దానికి అతిగా స్పందించడం తో పాటు కంటెంట్ క్రియేట్ చేయడం కోసం గొడవలు పెట్టు కోవడం చేస్తుంది. ఇంకా ఇతర వివాదాల కారణంగా ఆమె 10 వారాల కంటే ఎక్కువ ఉండక పోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. టాప్ ఫైవ్ వరకు వెళ్లే అవకాశం కూడా ఆమెకు లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను అభిమానించే వారు సైతం ఆమె ప్రవర్తన విషయం లో తప్పు పడుతున్నారు. ముందు ముందు అయినా ఆమె విషయం లో జాగ్రత్త వహించాలని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఆమె ఇదే ప్రవర్తన కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఫైనల్ వారికి ఉండకపోవచ్చు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.