Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ ఈసారి అరియానా నచ్చడం లేదు.. ఇదే కారణం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ ఈసారి అరియానా నచ్చడం లేదు.. ఇదే కారణం

 Authored By prabhas | The Telugu News | Updated on :26 March 2022,1:30 pm

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతుంది. తెలుగు ప్రేక్షకులు మరో సారి బిగ్బాస్ ను ఈ స్థాయి లో ఆదరిస్తారని అనుకోలేదు. ఊహించకుండా ఇంతటి సక్సెస్ దక్కింది. బిగ్ బాస్ లో ఈ సారి పాత కొత్తల కలయిక లో కంటెస్టెంట్స్ ఉన్న విషయం తెలిసిందే. మొదట కంటెస్టెంట్స్ విషయం లో విమర్శలు ఎదురయ్యాయి. కానీ పోను పోను వారి యొక్క ప్రవర్తన మరియు వారి యొక్క ఎంటర్టైన్మెంట్ నచ్చి ప్రేక్షకులు వారికి కనెక్ట్ అవుతున్నారు.

ముఖ్యంగా యాంకర్ శివ నీ తీసుకుంటే మొదట ఇతడు ఎందుకు అన్నట్టుగా ప్రతి ఒక్కరు భావించారు. కానీ అతడు ఇప్పుడు టాప్‌ 5 కంటెస్టెంట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి ఎంటర్‌ టైన్ మెంట్‌ ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బిందుమాధవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె చాలా కూల్ అండ్ కామ్‌ గోయింగ్ గా కనిపిస్తూనే తనదైన శైలిలో ఆటలు ఆడుతూ వస్తుంది. ఇక ఇంతకు ముందు సీజన్లో టాప్‌ 5 లో నిలిచిన అరియానా ఈసారి కూడా ఉండటంతో కచ్చితంగా ఫైనల్ వరకు పోతుందని.. ఈసారి ట్రోఫీని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ ప్రతి ఒక్కరు మొన్నటి వరకు భావించారు.

Bigg Boss OTT Telugu nonstop ariyana not doing well last two weeks

Bigg Boss OTT Telugu nonstop ariyana not doing well last two weeks

కానీ ఈ మూడు నాలుగు వారాలుగా ఆమె ప్రవర్తన విమర్శలకు తావిస్తోంది. ఆమె ప్రతి దానికి అతిగా స్పందించడం తో పాటు కంటెంట్ క్రియేట్ చేయడం కోసం గొడవలు పెట్టు కోవడం చేస్తుంది. ఇంకా ఇతర వివాదాల కారణంగా ఆమె 10 వారాల కంటే ఎక్కువ ఉండక పోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. టాప్ ఫైవ్ వరకు వెళ్లే అవకాశం కూడా ఆమెకు లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను అభిమానించే వారు సైతం ఆమె ప్రవర్తన విషయం లో తప్పు పడుతున్నారు. ముందు ముందు అయినా ఆమె విషయం లో జాగ్రత్త వహించాలని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఆమె ఇదే ప్రవర్తన కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఫైనల్ వారికి ఉండకపోవచ్చు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది