Home » Entertainment » Bigg Boss Ott Telugu The Contestant Will Be Eliminated This Week
Entertainment

Bigg Boss OTT Telugu : ఈవారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Published on: April 24, 2022, 9:30 pm
Advertisement

Bigg Boss OTT Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీలోను సంద‌డి చేస్తుంది. బిగ్ బాస్ నాన్‌స్టాప్ అంటూ 17 మందితో మొద‌లైన ఈ కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ అయితే మధ్యలో కాస్త నిరాశ పరిచినప్పటికీ మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇక ఈ మొదటి ఓటీటీ సీజన్లో అఖిల్ గ్యాంగ్ ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అఖిల్ తో మొదట స్నేహంగా ఉండి ఆ తర్వాత దూరమైన వాళ్ళు వెంటనే హౌస్ లో నుంచి వెళ్ళిపోతున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా బలంగా నిలదొక్కుకుని ముందుకు సాగితేనే చివరివరకు నిలుస్తారు ఏమాత్రం పొరపాటు చేసినా కూడా ఆడియన్స్ నుంచి మద్దతు కోల్పోవలసి వస్తుంది.
అఖిల్ ఎఫెక్ట్ ప‌డిందా?

Advertisement

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎలిమినేష‌న్ చూస్తుంటే అఖిల్ గ్యాంగ్ కు సంబంధించిన ఎలిమినేషన్ విషయంలో పక్షపాతం కొనసాగుతోందా అనిపిస్తోంది. అఖిల్ తో మొదట స్నేహంగా ఉన్న వారు ఆ తర్వాత గొడవపడడి విడిపోతే మాత్రం వెంటనే ఆ హౌస్ లో నుంచి వెళ్ళిపోతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చాలా వరకు కొంతమంది కంటెస్టెంట్స్ అఖిల్ గెలవడం కోసం ఎన్నో త్యాగాలు కూడా చేశారు. అయితే చివరికి వాళ్ళు బొక్క బోర్లా పడుతుండటం విశేషం. అఖిల్ గ్యాంగ్లో అషు రెడ్డి, అజయ్ ,స్రవంతి కొన్ని వారాల పాటు చాలా స్నేహంగా కొనసాగారు. ఎవరు ఎన్ని గొడవలు సృష్టించిన కూడా ఈ నలుగురు ఒకే దారిలో నడిచే ప్రయత్నం చేశారు.

Bigg Boss OTT Telugu the contestant will be eliminated this week

Advertisement

స్రవంతి తర్వాత అజయ్ పై కూడా డా గట్టి ప్రభావం చూపించినట్లు అర్థమవుతోంది. అసలైతే అజయ్ కు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే వరకూ పెద్దగా క్రేజ్ అయితే లేదు. అఖిల్ తో కొనసాగుతున్నాడు అనే ఒక కారణంచేత అతనికి ఎంతోకొంత ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. అఖిల్ నుండి కాస్త దూరం అయ్యాడు అనే స‌రికి అత‌నికి ఓటింగ్ శాతం త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తుంది. 8వ వారంలో బిందు, అజయ్, అఖిల్, హమీద, అనిల్, అషు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. కానీ బాబా భాస్కర్ బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక శక్తితో బిందును ఎలిమినేషన్ నుండి రక్షించారు. దీంతో అషు, హమిదా, అఖిల్, అజయ్, అనిల్ నామినేషన్లలో మిగిలారు. ఓటింగ్ ఫలితాల ప్రకారం హౌస్ నుండి అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. అఖిల్ ప‌క్క‌న పెట్ట‌డంతో ఇలా జ‌రిగింద‌ని అంటున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి