samantha daring step
Samantha : మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు ఈ తండ్రీకొడుకులు ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ రోల్స్ చేశారు. కానీ ఈ సారి మాత్రం పూర్తి స్థాయి పాత్రలతో మెగా అభిమానులను సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టిన ఆచార్య టీమ్..
నిన్న హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ప్రస్తుతం ప్రమోషనల్ యాక్టివిటీస్ సాగుతున్నాయి.సందేశాత్మక కథకు మాస్ కమర్షియల్ అంశాలన్నీ జోడించి కొరటాల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తే.. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే చేసింది. సోనుసూద్ తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలను పోషించగా.. క్రేజీ హీరోయిన్ రెజీనా ఇందులో స్పెషల్ సాంగ్ చేసింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మెగా మల్టీస్టారర్ కి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.రాంబో (విజయ్ సేతుపతి) ఖతీజా (సమంత రూత్ ప్రభు), కన్మణి (నయనతార) మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’.
samantha daring step
Samantha : డేరింగ్ స్టెప్..
తెలుగులో ఈ మూవీ “కన్మణి రాంబో ఖతీజా”గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. కాగా ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇది డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. ఆ మరుసటి రోజు అంటే 29న ‘ఆచార్య’ భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ సినిమాల హవా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ‘ఆచార్య’తో ‘కాతు వాకుల రెండు కాదల్’ మూవీ ఢీకొంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
This website uses cookies.