bigg boss ott Telugu very interesting in recent episode
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆసక్తికరంగా సాగుతుంది. 17 మంది సభ్యులు బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టగా సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. దీంతో విభేదాలు, గొడవలు మొదలయ్యాయి. ముమైత్, శ్రీరాపాక బ్యూటీ శ్రీ రాపాక మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అందరూ శ్రీ రాపాకను టార్గెట్ చేశారు. అరియానా, అఖిల్, తేజస్వీ, నటరాజ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇలా అందరూ కూడా శ్రీ రాపాకను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. చాలా మంది శ్రీ రాపాకకే థమ్స్ డౌన్ సింబల్‌ను పెట్టారు. దీంతో శ్రీ రాపాక కన్నీటి పర్యంతమైంది. తనను ఒక అబద్దాలకోరుగా చిత్రీకరిస్తున్నారంటూ వాపోయింది.
ముమైత్ ఖాన్ కూడా పాత విషయాలను గుర్తు పెట్టుకుని ఇక్కడ నా మీద ఇలా చేస్తోందంటూ ఆరోపించింది. ఓ డ్యాన్స్ షోలో తనకు, ముమైత్ ఖాన్‌కు జరిగిన విషయాలను గుర్తు పెట్టుకుందని, అందుకే ఇలా చేస్తోందంటూ నగ్నం బ్యూటీ తెగ ఏడ్చేసింది. ప్రస్తుతం అయితే వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ అనే పోటీ జరుగుతోంది. మొదటి వారం కెప్టెన్సీ కంటెండర్స్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. దమ్ముంటే చేసి చూపించు అంటూ ఇరు టీంలు పోటీ పడ్డాయి. ఇందులో భాగంగా మూడు టాస్కులు జరిగాయి. దాంట్లో వారియర్స్ టీం రెండు పాయింట్లతో గెలిచింది. రెండు సార్లు ఛాలెంజర్స్ టీంలోని మెంబర్స్ టాస్కులను పూర్తి చేయడంలో విఫలమయ్యారు.
bigg boss ott Telugu very interesting in recent episode
అఖిల్ .. శ్రీరాపాకతో వైబ్స్ లేవని చెప్పాడు. ఇద్దరి మధ్య బాండింగ్ కుదరడం లేదు లేదు అని అజయ్ ఏదో చెప్పాడని చెప్పాడు అఖిల్. అయితే తను ఆ మాట అనలేదని.. ఒకవేళ అంటే కనుక.. చూపించాలని కోరింది శ్రీరాపాక. ఇక ముమైత్ ఖాన్ కూడా అజయ్‌తో మంచి వైబ్స్ ఉన్నాయని అతనికి మంచి మార్కులే వేసేసింది. ఐ లైక్ యు చెప్పేసింది. అనంతరం శ్రీరాపాకతో వైబ్స్ ఏమీ లేవని.. వచ్చినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడూ ఇలాగే ఉన్నాం అని చెప్పింది ముమైత్. అయితే శ్రీరాపాక నవ్వుడంతో.. ముమైత్ వెటకారంగా నవ్వుతూ హేళన చేసింది. మొత్తానికి హౌజ్‌లో ఇప్పుడిప్పుడే గ్రూపులు ఏర్పడి వార్ నడుస్తుంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.