Bigg Boss Sarayu : అరెస్ట్ తర్వాత అందరికి క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ
Bigg Boss Sarayu : యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం 7 ఆర్ట్స్ సరయు ఇటీవల తెగ వార్తలలో నిలుస్తుంది. బిగ్ బాస్ షోతో మంచి ఆదరణ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ హాట్ షోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 7ఆర్ట్స్ ఫ్యామిలీ రీసెంట్‌గా రెస్టారెంట్ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో రిలీజ్ చేసింది.అయితే ఇందులో సరయు సహా ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు వీడియో రూపొందించారు. ఈ క్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని సరయుపై వీహెచ్‌పీ నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు..
దీంతో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందన్న అభియోగంపై 153a, 295a సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు యూట్యూబ్ నటి సరయుని బంజారాహిల్స్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసును బంజారాహిల్స్ ఠాణాకు ట్రాన్స్‌ఫర్ చేశారు సిరిసిల్ల పోలీసులు. దీంతో తన న్యాయవాదితో కలిసి పోలీసుల విచారణకు హాజరైంది సరయు. తాను హిందువునే అని చెబుతున్నారు సరయురాయ్. ఎవరినీ కించపరిచేందుకు ఆ వీడియో చేయలేదని, అలాంటి ఉద్దేశం కూడా లేదంటోంది సరయు. ఎవరైన బాధపడి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నానని పేర్కొంది.
Bigg Boss Sarayu : తగ్గక తప్పలేదు..
సరయు రాయ్‌ని రెండో రోజు విచారించారు పోలీసులు.సరయుపై 41A CRPC కింద నోటీసులు ఇచ్చిన బంజారాహిల్స్ పోలీసులు, 153 A, 295 A కింద కేసులు నమోదు చేశారు. సెవెన్ ఆర్ట్స్ హోటల్ ప్రమోషన్ కోసం చేసిన వీడియోలోని దృశ్యాలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నది సరయుపై ఉన్న ప్రధాన అభియోగం. హోటల్ ప్రచార వీడియోలో సరయు అండ్ కో.. గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ని తలకు ధరించి, చేతిలో కర్రలు పట్టుకున్నారు. హోటల్ లోపలికి వెళ్లి లవర్స్‌పై దాడి చేశారు. ఓనర్ బెదిరించి ఆఖరికి ఆతనితోనే రొమాన్స్‌లో పడడం వివాదానికి ఆజ్యం పోసింది.