Big boss contestant Ariyana glory comments about personal life
Bigg Boss Sarayu : ఓటీటీలో అదరగొడుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. హౌజ్ నుండి ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ కాగా, చివరిగా బయటకు వచ్చింది సరయు. నిజానికి నాలుగోవారం చాలెంజర్స్‌లో నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్నారంతా. పెద్దగా పాపులారిటీ లేని అనిల్, మిత్ర శర్మలలో ఎవరో ఒకరు బయటకు వచ్చేయడం తథ్యం అని ఫిక్స్ అయ్యారు.కానీ అంచనాలను తలకిందులు చేస్తూ చాలెంజర్స్‌లో నుంచి కాకుండా వారియర్స్‌లో నుంచి సరయు ఎలిమినేట్ అయిపోవడం కొంత ఆశ్చర్యకరమే! కాగా సరయు నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చి తొలి వారమే ఎలిమినేట్ అయింది.
అయితే నాలుగో వారం బయటకు వచ్చిన సరయు ఇంటర్వ్యూలో అరియానాపై విరుచుకుపడింది.అరియానా చేసిన తప్పుకి బలై ఎలిమినేషన్‌తో బయటకు వచ్చిన సరయు తనకు అన్యాయం చేశారంటూ ఎమోషనల్ అయ్యింది. మాటలు అనేది వాళ్లే.. నామినేట్ చేసేదీ వాళ్లే.. అన్యాయంగా నన్ను హౌస్ నుంచి ప్లాన్ చేసి బయటకు పంపారని వాపోయింది సరయు. హౌస్‌లో ఉండగా అరియానా తనని బాడీ షేమింగ్ చేసిందని.. చివరికి ఆమే నామినేట్ చేసిందని.. న్యాయంగా అయితే నేను ఎలిమినేట్ కాకూడదు.. ఎవరో చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి నన్ను బయటకు పంపించారని చెప్పింది సరయు. వాళ్లందరు ఫూల్స్ కింద లెక్కే అన్నట్టు కామెంట్ చేసింది.ఇక అరియానాకి గట్టి వార్నింగ్ ఇచ్చింది సరయు..
Bigg Boss sarayu fire on ariyana
‘బిగ్ బాస్ షో కాబట్టి వదిలేశా.. ఆడియన్స్ చూస్తున్నారని గమ్మున ఊరుకున్నా.. బయట దొరికితే మాత్రం వదిలిపెట్టను తోలు తీస్తా. ఛాన్స్ వస్తే మూతి పగలకొడతా.. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న అరియానా బిగ్ బాస్‌కి అనర్హురాలు’ అంటూ తన బాధను వ్యక్తపరిచింది సరయు. అషురెడ్డి, అజయ్, అఖిల్, స్రవంతి వీళ్లంతా డబుల్ ఫేస్.. నామినేషన్స్‌లో వీళ్లంతా కలసి ఒకర్నే టార్గెట్ చేస్తారు.. ఎలాంటి రీజన్స్ లేకుండా టార్గెట్ చేస్తూ ఉంటారు. అఖిల్ బ్యాచ్‌లో ఉన్నవాళ్లంతా డబుల్ ఫేస్.అఖిల్ గ్రూప్ ఎవరితోనూ కలవరు.. మనల్ని వెళ్లి ఆ గ్రూప్‌లో కలవనియ్యరు. నేను అఖిల్‌తో మాట్లాడాలని ప్రయత్నిస్తే.. పక్కనున్న వాళ్లు.. ఏ..ఏ.. అని చిల్లరగా చేస్తారు. ఈ చిల్లర వేషాలు వేయడంతో అషురెడ్డి ఫస్ట్ ఉంటుంది అని చెప్పుకొచ్చింది సరయు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.