Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ లోని ఆ 21 మందిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నది ఎవరు!

 Authored By prabhas | The Telugu News | Updated on :7 September 2022,11:00 am

Bigg Boss 6 Telugu : గత రెండు మూడు నెలలుగా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఊరించిన బిగ్‌ బాస్ సీజన్ 6 మొన్న ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎప్పటి లాగే జబర్దస్త్ కమెడియన్ లు ఈ కార్యక్రమంలో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఈసారి జబర్దస్త్ నుండి చలాకి చంటి మరియు ఫైమా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన వారిలో చాలా మంది గురించి ప్రేక్షకులకు అసలు తెలియనే తెలియదు. కొందరు సీరియల్ ద్వారా కొందరి సినిమాల ద్వారా అప్పుడప్పుడు కనిపించినా ఎక్కువ శాతం మంది అసలు ఎక్కడ నుండి వచ్చారా కూడా అర్థం కావడం లేదు అంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

అతి తక్కువ పారితోషికం ఇచ్చి వాళ్లను తీసుకు వచ్చారా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ఇద్దరి కంటెస్టెంట్స్ గా చలాకి చంటి మరియు సింగర్ రేవంత్ ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరికీ వారానికి నాలుగు లక్షల నుండి నాలుగున్నర లక్షల రూపాయల పారితోషకం అందిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అతి తక్కువ పారితోషికం యూట్యూబర్‌ ఆది రెడ్డికి ఇస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆయనకు వారానికి లక్షన్నర మాత్రమే పారితోషకంగా ఇస్తున్నారట. ఇక అమ్మాయిలకు రెండు లక్షలు మూడు లక్షలు అలా పారితోషికం ఇస్తున్నారట.

bigg boss season 6 telugu top paid contestants

bigg boss season 6 telugu top paid contestants

మొత్తానికి చాలా తక్కువ పారితోషకం ని బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ కి ఇస్తున్నారు. గతంలో ఇండియన్ ఐడల్ గా నడిచిన సింగర్ రేవంత్ పారితోషికం ఇంత తక్కువ ఉంటుందని ఎవరు అనుకుని ఉండరు.. కానీ ఆయనకు కూడా ఈ సీజన్లో తక్కువ పారితోషికం ఇస్తున్నారు. రేటింగ్ భారీగానే వస్తుంది.. లాభాలు భారీగా వస్తున్నాయి. అయినా కూడా కంటెస్టెంట్స్ కి పారితోషకం చాలా తక్కువ ఇస్తారు అని తెలుగు బిగ్ బాస్ నిర్వహకులపై విమర్శలు ఉన్నాయి. అది మరోసారి ఇలా నిరూపితమైంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగార్జున పారితోషికం మాత్రం భారీగా పెరిగింది. ఆయన ఏకంగా 15 కోట్ల రూపాయల పారితోషికం ని ఈ సీజన్ కి గాను అందుకుంటున్నాడని సమాచారం అందుతుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి