shanmukh : యాంకర్ పై ఫైర్ అయిన సిరి.. షణ్ముఖ్ బంధంపై ప్రశ్నకు ఇంటర్వ్యూ నుంచి వాకౌట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

shanmukh : యాంకర్ పై ఫైర్ అయిన సిరి.. షణ్ముఖ్ బంధంపై ప్రశ్నకు ఇంటర్వ్యూ నుంచి వాకౌట్..!

shanmukh : బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం.. సిరి , షణ్ముఖ్ లు ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన వారికి ప్రధానంగా ఓ ప్రశ్న ఎదురవుతోంది. హౌజ్ లో వారి శృతి మించిన సరసాల గురించి చెప్పమని అంతా వారిని నిలదీస్తున్నారు. ఇటీవల సిరి ఓ యూట్యూబ్ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పదే పదే.. సిరి-షణ్ముఖ్‌ల హగ్‌లపైనే ప్రశ్నలు ఎదురవడంతో తను అక్కడినుంచి కోపంతో లేచి వెళ్ళిపోయింది. ఇప్పుడీ వీడియో బైట్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :22 December 2021,3:40 pm

shanmukh : బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం.. సిరి , షణ్ముఖ్ లు ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన వారికి ప్రధానంగా ఓ ప్రశ్న ఎదురవుతోంది. హౌజ్ లో వారి శృతి మించిన సరసాల గురించి చెప్పమని అంతా వారిని నిలదీస్తున్నారు. ఇటీవల సిరి ఓ యూట్యూబ్ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పదే పదే.. సిరి-షణ్ముఖ్‌ల హగ్‌లపైనే ప్రశ్నలు ఎదురవడంతో తను అక్కడినుంచి కోపంతో లేచి వెళ్ళిపోయింది. ఇప్పుడీ వీడియో బైట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.షన్నుతో బంధం గురించి యాంకర్ నుంచి ఎదురైన వరుస ప్రశ్నలకు సిరికి కోపం ముంచుకొచ్చింది. అతనిపై ఫైర్ అవుతూ లేచి వెళ్లిపోగా.. మళ్ళీ ఆ యాంకర్ ఆమెను బతిమాలి మళ్ళీ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టగా.. సిరి తన గోడు వెళ్లబోసుకుంది.

హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం తనపై జరుగుతున్న నెగిటివిటీని చూసి ఎమోషనల్ అయినట్లు సిరి తెలిపింది. తమపై బయట ఇంతలా ప్రచారం జరిగిందా అని తెలుసుకుని బాధ పడినట్లు చెప్పుకొచ్చింది. షణ్ముఖ్ తో హగ్గుల వివాదంపై స్పందిస్తూ.. మా అమ్మ వచ్చి హగ్‌లు చేసుకోవద్దని చెప్పారు. అయితే తమ ఉద్దేశ్యం అది కాదని, తాము మంచి స్నేహితులని చెప్పడంతో అమ్మ రియలైజ్ అయినట్లు చెప్పుకొచ్చింది. అమ్మ చెప్పినంత మాత్రానా.. తాము మళ్ళీ ఒకరికొకరు దూరంగా ఉంటే.. తాము అన్ని రోజులు చేసింది తప్పు అని ఒప్పుకున్నట్లేనని పేర్కొంది. అయినా ఒకవేళ తాము తప్పే చేస్తున్నట్లయితే.. కెమెరా ముందు ఎలా చేస్తామని వివరించింది. తమ మధ్య ఇప్పటికీ ఉన్నది మంచి స్నేహ బంధమే అని స్పష్టం చేసింది. ఓట్లు వేసి తనను టాప్ 5 కి తీసుకొచ్చిన అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా తాను తీసుకుంటానని తెలిపింది.

bigg boss siri fires on anchor about her relation with shanmukh

bigg boss siri fires on anchor about her relation with shanmukh

shanmukh : తమ మధ్య ఉంది స్నేహ బంధమే..!

బిగ్ బాస్ సీజన్ లో విన్నర్ గా విజే సన్నీ గెలిచాడు. షన్ను స్వయంకృతాపారాధం వల్ల వీజే సన్ని విజేతగా నిలిచాడు. సిరితో షణ్ముఖ్ నడిపిన వ్యవహారమే లేకుంటే తనే గెలిచేవాడిని అంతా అంటున్నారు. హౌస్ లో వారిద్దరి బంధం… వారివురీ ఇమేజ్ లను డ్యామేజ్ చేసింది. ప్రతీ సీజన్ లో ఏదో ఒక జంట లవ్ ట్రాక్ ద్వారా ఫేమస్ అవ్వగా.. ఈ సీజన్ లో మాత్రం అందరూ ఎక్కువగా మాట్లాడుకున్నది సిరి, షన్నుల బంధం గురించే. హగ్గులు, కిస్సులతో ఓ పక్క మేం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే.. అసభ్యంగా రొమాన్స్ చేశారు. బాత్రూంలో, ఇంట్లో లేట్ నైట్.. వీరిద్దరి రొమాన్స్ ను జనాలు చూడలేకపోయారు. బయట వీరిద్దరికీ వేరు వేరుగా పెయిర్స్ ఉన్నా.. హౌజ్ లోపల వీరి రిలేషన్ ఏంటో ఆట ముగింపుకు వచ్చినా ఎవ్వరికీ అర్థంకాలేదు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది