#image_title
Bigg Boss Telugu 7 : ఇది బిగ్ బాస్ సీజన్ 7. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అవును.. బిగ్ బాస్ సీజన్ 7 అంటేనే ఉల్టా పుల్టా. ఇదివరకు సీజన్స్ లా కాదు. ఈ సీజన్ లో అసలు ఏం జరుగుతోందో బిగ్ బాస్ కే తెలియడం లేదు. ఇటీవలే శివాజీ పవరాస్త్రను లాగేసుకున్నాడు బిగ్ బాస్. దీంతో ఆయన కంటెస్టెంట్ గా మారిపోయాడు. ఇక హౌస్ మెట్స్ గా మిగిలింది ముగ్గురే. వాళ్లు కూడా సందీప్, ప్రశాంత్, శోభ. ఈ ముగ్గురు హౌస్ మెట్స్ గా ఉన్నారు అని అనుకునే లోపే.. వాళ్ల దగ్గర ఉన్న పవరాస్త్రలను కూడా బిగ్ బాస్ తీసేసుకున్నాడు. మీ పవరాస్త్రను తిరిగి ఇచ్చేసే సమయం వచ్చింది అని బిగ్ బాస్ చెప్పి యాక్టివిటీ రూమ్ లో ఉన్న ఓ పెట్టెలో మీ పవరాస్త్రలను పెట్టేయాలని చెబుతాడు బిగ్ బాస్. దీంతో ముగ్గురు తీసుకెళ్లి తమ పవరాస్త్రలను అందులో పెట్టేస్తారు.
కానీ.. అసలు తాము ఇంకా హౌస్ మెట్స్ గా ఉన్నా కూడా ఎందుకు బిగ్ బాస్ తమ పవరాస్త్రలను తీసి పెట్టెలో పెట్టమన్నాడో వాళ్లకు అర్థం కాదు. ఏది ఏమైనా.. వాళ్ల పవరాస్త్రలు కూడా పోవడంతో శివాజీ చాలా సంతోషిస్తాడు. డ్యాన్స్ చేస్తాడు. ఎయ్ ఎయ్ రో చూస్తవేరో.. పాడండ్రా అంటూ డ్యాన్స్ చేస్తాడు శివాజీ. ఆయన అలా చేయడంపై శోభా శెట్టి సీరియస్ అవుతుంది. కొందరు ఉంటారు. ఎవరిదైనా పోతే చాలు.. హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్లు. అదేదో అంటారు కదా. మనకు రాకపోయినా పర్వాలేదు. పక్కనివాళ్లకు రాకపోతే చాలు.. ఛీ.. అంటూ శోభాశెట్టి.. శివాజీని ఉద్దేశించి మాట్లాడుతుంది. ఏది ఏమైనా శివాజీ మాత్రం వాళ్ల పవరాస్త్రలను బిగ్ బాస్ తీసుకోవడంతో చాలా సంతోషిస్తాడు.
#image_title
తనకు కనీసం కాఫీ కూడా ఇవ్వడం లేదని.. హౌస్ మెట్ నుంచి కంటెస్టెంట్ గా మారాక తనకు ఒక కాఫీ కూడా తాగలేకపోతున్నానని శివాజీ తెగ బాధపడిపోతాడు. నా మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాఫీ కూడా ఇవ్వలేని బతుకు నాతో బతుకా.. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటోంది అంటూ శివాజీ తెగ బాధపడిపోతాడు. మరోవైపు ఈ వారం నామినేషన్లలో అందరు కంటెస్టెంట్లు ఉన్నారు. ఒక్క హౌస్ మెట్స్ సందీప్, ప్రశాంత్, శోభ తప్ప. ఈసారి నామినేషన్లలో ఉన్న వాళ్లలో వీక్ గా అంటే టెస్టీ తేజ, శుభశ్రీ ఉన్నారు. ఈ వారం ఈ ఇద్దరిలో ఒకరు ఇంటి నుంచి బయటికి వెళ్లే చాన్స్ ఉంది. ఇక.. ఈ వారంలోనే కొత్త కంటెస్టెంట్లు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే చాన్స్ ఉంది. చూద్దాం మరి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎంతమంది కంటెస్టెంట్లు వస్తారో?
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
This website uses cookies.