Crystal Tortoise : తాబేలును శ్రీమహావిష్ణువు అవతారంగా భావిస్తారు. అందుకే తాబేలు ప్రతిమను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. స్పటిక తాబేలు ఇంట్లో ఉంచడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి. తాబేలు ప్రతిమ విష్ణువుకు ప్రతిరూపం కాబట్టి దానిని ఇంట్లో ఉంచడం ద్వారా విష్ణువు భార్య లక్ష్మీదేవి కూడా ఇంట్లో నివసిస్తుంది. ఫలితంగా సానుకూల శక్తి ఉంటుంది. స్పటిక తాబేలు ఇంట్లో ఉంచితే సంపద, ధన ధాన్యాలు లభిస్తాయి. అంతేకాకుండా ఎలాంటి దుఃఖం, రోగాలు ఉండవు. వారి జీవితకాలం పెరుగుతుంది. ఉద్యోగం రాక ఇబ్బంది పడేవారు వాస్తు శాస్త్ర ప్రకారం తమ ఇంట్లో స్పటిక తాబేలు ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన మధ్యలో ఆగిపోయిన వారి పని పూర్తవుతుంది. మంచి పురోగతి ఉంటుంది.
అంతేకాకుండా ఆఫీసులో లేదా బెడ్ రూమ్ లో కూడా ఉంచితే అదృష్టం పొందవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. స్పటిక తాబేలు ఇంట్లో ఉంచితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. అయితే దానిని సరైన దిశలో ఉంచినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇంట్లో ప్రతికూల శక్తులను ప్రభావం చూపకుండా చేస్తుంది. ఇంటి ఉత్తర దిశలో స్పటిక తాబేలును ఉంచాలి. మంచి ఆరోగ్యం కోసం స్పటిక తాబేలును తూర్పు ముఖం వైపు పెట్టాలి. అలాగే నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే తల దగ్గర క్రిస్టల్ తాబేలు ఉంచాలి. నగదు లాకర్లో కూడా క్రిస్టల్ తాబేలును ఉంచవచ్చు దీని ద్వారా ఆస్తులు స్థిరంగా ఉంటాయి.
స్పటిక తాబేలును పౌర్ణమి వెలుగులో ఉంచినట్లయితే శక్తివంతమైన ప్రయోజనాలు పొందుతారు. ఉపయోగంలో లేనప్పుడు స్పటిక తాబేలును కాటన్ బ్యాగులో ఉంచాలి. స్పటిక తాబేలు ఇంట్లో ఉంచడం వలన డబ్బు స్థిరంగా ఉంటుంది. దీర్ఘాయువు జీవించడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. చుట్టూ ఉన్న వాతావరణం స్పటిక తాబేలు ద్వారా సమతుల్యం, శ్రావ్యంగా ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పిల్లల చదువుపై బాగా దృష్టి పెట్టడానికి ఈ స్పటిక తాబేలు సహాయపడుతుంది. మొత్తానికి స్పటిక తాబేలును అదృష్ట ప్రతిమగా భావిస్తారు. దీనిని ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.