Bigg Boss Tamanna comments on CPI Narayana
Bigg Boss : తమన్నా ఈ పేరు చెబితే అందరికి మిల్కీ బ్యూటీ, కథానాయిక తమన్నా గుర్తొస్తుంది. కాని మనం మాట్లాడుకునేది బిగ్ బాస్ షోలో పాల్గొన్న తమన్నా గురించి. ఈమె బిగ్ బాస్ హౌజ్‌లో ఉండగా, కంటెస్టెంట్స్‌కి చుక్కలు చూపించింది. అంతేకాదు బయటకు వచ్చాక కూడా సంచలన కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గానిలిచింది. తాజాగా ఓ ఛానెల్ లో బిగ్ బాస్ కార్యక్రమంపై జరిగిన హాట్ హాట్ చర్చలో తమన్నా సీపీఐ నాయకుడు నారాయణని చెప్పుతో కొట్టాలని అన్నారు. వివరాలలోకి వెళితే నారాయణ.. బిగ్ బాస్ షో వ్యభిచార గృహమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ నారాయణ గతంలోనూ డిమాండ్ చేశారు.
బిగ్ బాస్ హౌస్ లోపల జరుగుతున్నదంటూ చీకటి వ్యవహారమంటూ ఆయన మండిపడుతున్నారు.టీవీ స్క్రీన్‌పై సెన్సేషన్‌గా మారిన బిగ్‌బాస్ షో… పెద్దల నుంచి పిల్లల వరకు జనం వెర్రిగా చూస్తున్నారు. ఎందుకూ పనికిరాని ఈ షో వల్ల… సమాజం నాశనమైపోతుందన్నది ఆయన వాదన. అందుకే, బిగ్ బాస్ ప్రసారాలను వెంటనే ఆపేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. స్టాప్ బిగ్‌బాస్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రచారం చేయబోతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ పేరిట మహిళల్ని అవమానించొద్దన్నారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి… ఇలాంటి షోలు చేయొద్దని సూచిస్తున్నారు. యాంటి బిగ్‌బాస్ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానంటున్నారు.
Bigg Boss Tamanna comments on CPI Narayana
బిగ్‌బాస్‌పై ఎప్పుడూ తనది ఒకటే అభిప్రాయం అంటున్నారు. గతంలో కాస్త కూల్‌గానే బిగ్‌బాస్ షోపై విమర్శలు చేసిన నారాయణ.. ఈసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో తమన్నా రెచ్చిపోయి కామెంట్స్ చేసింది. తాజాగా జరిగిన ఓ టీవీ డిబేట్‌లో తమన్నా మాట్లాడుతూ ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నారాయణను చెప్పులతో కొట్టాలని అన్నారు. ఈ టీవీ డిబేట్‌లోని ఇతర నిపుణులు తమన్నా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె అభ్యంతర వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ తమన్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బిగ్ బాస్ షోను సమర్థిస్తూ అదే తమకు గుర్తింపు తెచ్చిపెట్టిందని, బయట ఊహిస్తున్నది నిజం కాదని అన్నారు
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.