Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో తొలిసారి.. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌తో నామినేష‌న్స్ ఏంటి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో తొలిసారి.. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌తో నామినేష‌న్స్ ఏంటి ?

 Authored By ramu | The Telugu News | Updated on :19 November 2024,2:02 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో తొలిసారి.. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌తో నామినేష‌న్స్ ఏంటి ?

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8లో ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. గ‌త సీజ‌న్స్ కి భిన్నంగా అనేక ట్విస్ట్‌లు ఇస్తూ స‌ర్‌ప్రైజ్ చేస్తున్నారు. 11వ వారం అవినాష్ ఎలిమినేట్ కావాల్సింది. నబీల్ తన వద్ద ఉన్న అవిక్షన్ షీల్డ్ అవినాష్ కోసం వాడాడు. దాంతో ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఇక 12వ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ సోమవారం మొదలైంది. అనూహ్యంగా నామినేట్ చేసే బాధ్యత ఎలిమినేటైన కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు బిగ్ బాస్. బెజవాడ బేబక్క, సోనియా, శేఖర్ బాషా, మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు. కారణాలు చెప్పి ప్రతి ఒక ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఇద్దరు హౌస్ మేట్స్ ని నామినేట్ చేయాల్సి ఉంటుంది.

Bigg Boss Telugu 8 ఇంట్రెస్టింగ్‌గా నామినేష‌న్స్..

నామినేట్ చేసిన వారి తలపై షుగర్ బాటిల్ పగలగొట్టాలి. మెగా ఛీప్ గా ఉన్న అవినాష్ కి మినహాయింపు ఉంటుంది. అతన్ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. ముందుగా సోనియా హౌజ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె ప్రేరణ, నిఖిల్‌ను నామినేట్ చేసింది. ప్రేరణ రూడ్‌గా ఉందని, నిఖిల్ నామినేట్ పాయింట్స్ స్ట్రాంగ్‌గా ఉండవని, పర్సనల్‌గా చేస్తాడని, ఎమోషన్స్‌కు విలువ ఇవ్వడని కారణాలు చెప్పింది సోనియా. ఈ క్రమంలోనే ప్రేరణ, సోనియా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అలాగే, నిఖిల్, సోనియా నామినేషన్స్‌లో యష్మీ టాపిక్ వచ్చి రచ్చ రచ్చ అయింది. అనంతరం బెజవాడ బేబక్క వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది. ఫిజికల్ స్ట్రెంత్ ఉండటమే బలమని ఫీల్ అవడం, మిగతావారిని అగౌవరపరచడం, కించపరచడం వంటివి చేస్తావని నామినేట్ చేసింది. మిమ్మల్ని నామినేట్ చేస్తే ఎలిమినేట్ అయ్యారని అందుకే న‌న్ను నామినేట్ చేస్తున్నారని పృథ్వీ డిఫెండ్ చేసుకున్నాడు.

Bigg Boss Telugu 8 బిగ్ బాస్ చ‌రిత్ర‌లో తొలిసారి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌తో నామినేష‌న్స్ ఏంటి

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో తొలిసారి.. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌తో నామినేష‌న్స్ ఏంటి ?

ఇక రెండో వారం ఎలిమినేటైన శేఖర్ బాషా.. యష్మి, ప్రేరణలను నామినేట్ చేశాడు. శేఖర్ బాషా పాయింట్స్ కి వారిద్దరి వద్ద సమాధానం లేకుండా పోయింది. మంగళవారం నాడు హౌజ్‌లోకి నాగ మణికంఠ, కిర్రాక్ సీత, నైనిక, ఆదిత్య ఓం రానున్నారు. వీరిలో నిఖిల్, నబీల్‌ను నాగ మణికంఠ నామినేట్ చేయగా.. యష్మీ, ప్రేరణను సీత నామినేట్ చేసింది. అలాగే, నబీల్, యష్మీని నైనిక నామినేట్ చేసింది. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 8 పన్నెండో వారం నామినేషన్స్‌లో నిఖిల్, ప్రేరణ, యష్మీ, నబీల్‌కు రెండసార్లకు ఎక్కువగా నామినేట్ ఓట్లు పడగా.. పృథ్వీకి ఒక్కసారి పడినట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం నామినేషన్స్‌లో ఈ ఐదుగురు నామినేట్ అయినట్లు తెలుస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది