Bigg Boss Telugu 8 : ఈ రోజు డబుల్ ఎలిమినేషనా.. విన్నర్ ఎవరో కూడా తేల్చనున్నారా..!
ప్రధానాంశాలు:
Bigg Boss Telugu 8 : ఈ రోజు డబుల్ ఎలిమినేషనా.. విన్నర్ ఎవరో కూడా తేల్చనున్నారా..!
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఎనిమిదో సీజన్ జరుపుకుంటుంది. ఈ సీజన్ కూడా తుది దశకు చేరుకుంది. డిసెంబర్ 15న బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే నిర్వహించి విజేతను ప్రకటించనున్నారు. అందుకు ఇంకొక వారమే మిగిలి ఉంది. ఇక బిగ్ బాస్ తెలుగు 8 నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తి నెలకొంది.ఒకరు లేదా ఇద్దరు హౌజ్ నుండి నేడు ఎలిమినేట్ అవుతారు అనే టాక్ నడుస్తుంది. మిగతా కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్స్ గా టైటిల్ రేసులో ఉంటారు. కాగా బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ పోరు గౌతమ్, నిఖిల్ మధ్యే అంటున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే.
Bigg Boss Telugu 8 విన్నర్ ఎవరంటే..
ఇక ఓటింగ్ లో కూడా గౌతమ్, నిఖిల్.. మొదటి రెండు స్థానాల్లో ఉంటున్నారు. కాబట్టి ఈసారి టైటిల్ అందుకునేది వీరిద్దరిలో ఒకరు అని తేల్చి చెబుతున్నారు. ఈ శనివారమే నాగార్జున విన్నర్ ఎవరో తేల్చేస్తాడని అంటున్నారు. అదెలా అంటే… గౌతమ్, నిఖిల్ మధ్య టైటిల్ రేసు నడుస్తుంది. ఈ వారం వారు గొడవలు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి నాగార్జున ఖచ్చితంగా సదరు గొడవల్లో తప్పు ఎవరిదో తేల్చే ప్రయత్నం చేస్తాడు. తప్పు నీదే అని నాగార్జున ఎవరిని తిడతారో అతడే విన్నర్ అట. నాగార్జున జడ్జిమెంట్ చాలా పక్షపాతంగా ఉంటుంది. ఆయన కనీసం ఎపిసోడ్స్ కూడా చూడకుండా తప్పొప్పులు నిర్ణయిస్తున్నాడు.
బిగ్ బాస్ మేకర్స్ ఇచ్చే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. చిన్న తప్పులకు కూడా కొందరిని టార్గెట్ చేసే నాగార్జున కొందరి తప్పులను ఎత్తి చూపుతాడు.జనాల అభిప్రాయానికి నాగార్జున జడ్జిమెంట్ కి పొంతలేకుండా పోతుంది. ఈ క్రమంలో నాగార్జున తిట్టిన కంటెస్టెంట్ కి సానుభూతి దక్కుతుంది. ఓట్లు పడతాయి. విన్నర్ అవుతాడనే ఒక వాదన తెరపైకి వచ్చింది. డ్‌ను రేపు (డిసెంబర్ 8) ప్రసారం చేయనున్నారు. అయితే, బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం ఓటింగ్‌లో యాంకర్ విష్ణుప్రియ అట్టడుగు స్థానంలోకి పడిపోయింది. మొన్నటి ఎపిసోడ్‌లో (డిసెంబర్ 5) ఓటింగ్ అప్పీల్ అవకాశం పొంది ఓట్లను అభ్యర్థించిన కూడా ఆమె స్థానం పెద్దగా మారలేదు.14వ వారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, నిఖిల్, గౌతమ్, రోహిణి, నబీల్, ప్రేరణ ఆరుగురు ఉన్నారు. వీరికి ప్రారంభమైన ఓటింగ్ పోల్‌లో టాప్ 2 స్థానాల్లో నిఖిల్, గౌతమ్ నిలుస్తూ వస్తున్నారు . Bigg Boss Telugu 8 who will be the winner host nagarjuna going to hint