
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌తో నామినేషన్స్ ఏంటి ?
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. గత సీజన్స్ కి భిన్నంగా అనేక ట్విస్ట్‌లు ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. 11వ వారం అవినాష్ ఎలిమినేట్ కావాల్సింది. నబీల్ తన వద్ద ఉన్న అవిక్షన్ షీల్డ్ అవినాష్ కోసం వాడాడు. దాంతో ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఇక 12వ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ సోమవారం మొదలైంది. అనూహ్యంగా నామినేట్ చేసే బాధ్యత ఎలిమినేటైన కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు బిగ్ బాస్. బెజవాడ బేబక్క, సోనియా, శేఖర్ బాషా, మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు. కారణాలు చెప్పి ప్రతి ఒక ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఇద్దరు హౌస్ మేట్స్ ని నామినేట్ చేయాల్సి ఉంటుంది.
నామినేట్ చేసిన వారి తలపై షుగర్ బాటిల్ పగలగొట్టాలి. మెగా ఛీప్ గా ఉన్న అవినాష్ కి మినహాయింపు ఉంటుంది. అతన్ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. ముందుగా సోనియా హౌజ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె ప్రేరణ, నిఖిల్‌ను నామినేట్ చేసింది. ప్రేరణ రూడ్‌గా ఉందని, నిఖిల్ నామినేట్ పాయింట్స్ స్ట్రాంగ్‌గా ఉండవని, పర్సనల్‌గా చేస్తాడని, ఎమోషన్స్‌కు విలువ ఇవ్వడని కారణాలు చెప్పింది సోనియా. ఈ క్రమంలోనే ప్రేరణ, సోనియా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అలాగే, నిఖిల్, సోనియా నామినేషన్స్‌లో యష్మీ టాపిక్ వచ్చి రచ్చ రచ్చ అయింది. అనంతరం బెజవాడ బేబక్క వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది. ఫిజికల్ స్ట్రెంత్ ఉండటమే బలమని ఫీల్ అవడం, మిగతావారిని అగౌవరపరచడం, కించపరచడం వంటివి చేస్తావని నామినేట్ చేసింది. మిమ్మల్ని నామినేట్ చేస్తే ఎలిమినేట్ అయ్యారని అందుకే నన్ను నామినేట్ చేస్తున్నారని పృథ్వీ డిఫెండ్ చేసుకున్నాడు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌తో నామినేషన్స్ ఏంటి ?
ఇక రెండో వారం ఎలిమినేటైన శేఖర్ బాషా.. యష్మి, ప్రేరణలను నామినేట్ చేశాడు. శేఖర్ బాషా పాయింట్స్ కి వారిద్దరి వద్ద సమాధానం లేకుండా పోయింది. మంగళవారం నాడు హౌజ్‌లోకి నాగ మణికంఠ, కిర్రాక్ సీత, నైనిక, ఆదిత్య ఓం రానున్నారు. వీరిలో నిఖిల్, నబీల్‌ను నాగ మణికంఠ నామినేట్ చేయగా.. యష్మీ, ప్రేరణను సీత నామినేట్ చేసింది. అలాగే, నబీల్, యష్మీని నైనిక నామినేట్ చేసింది. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 8 పన్నెండో వారం నామినేషన్స్‌లో నిఖిల్, ప్రేరణ, యష్మీ, నబీల్‌కు రెండసార్లకు ఎక్కువగా నామినేట్ ఓట్లు పడగా.. పృథ్వీకి ఒక్కసారి పడినట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం నామినేషన్స్‌లో ఈ ఐదుగురు నామినేట్ అయినట్లు తెలుస్తోంది.
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.