Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ రెండోవారంలోకి ప్రవేశించింది. తొలివారం హౌస్ నుంచి మొమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యింది. నిజానికి మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మొమైత్ ఖాన్ వెళ్లిపోవడంతో అందరూ అవాక్కయ్యారు. దీంతో తనను అందరూ తప్పుగా పోట్రే చేశారంటూ మొమైత్ చాలా ఎమోషనల్ అయిపోయింది. మరోవైపు రెండో వారంలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా 11 మంది నామినేట్ అయ్యారు.ఈ వారం నామినేషన్స్ చాలా డిఫరెంట్‌గా జరిగాయి. ప్రతి వారం ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున నామినేట్ చేస్తుంటారు.
అయితే ఈ వారంలో వారియర్స్ టీం నుంచి ఒక్కొక్కరు ఒక్కో ఇంటి సభ్యుడిని మాత్రమే నామినేట్ చేయాలని బిగ్‌బాస్ సూచించారు. కత్తి ఇచ్చి నామినేట్ చేయాలనుకున్న వాళ్ల ఫొటోపై గుచ్చి నామినేట్ చేయాలని చెప్పారు.సరయు యాంకర్ శివను, అషురెడ్డి మిత్రా శర్మను, అఖిల్ యాంకర్ శివను, తేజస్వి అనిల్‌ను, మహేష్ విట్టా అనిల్‌ను, నటరాజ్ మాస్టర్ యాంకర్ శివను, హమీదా మిత్రా శర్మను, అరియానా శ్రీరాపాకను నామినేట్ చేశారు. అటు ఛాలెంజర్స్ టీమ్ తరఫున ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేశారు.
ఆర్జే చైతూ.. అఖిల్‌ను, స్రవంతి చొక్కారపు సరయును, శ్రీరాపాక అరియానాను, అనిల్ సరయును, అజయ్ సరయును, బిందుమాధవి నటరాజ్ మాస్టర్‌ను, మిత్రా శర్మ అషురెడ్డిని, యాంకర్ శివ సరయును నామినేట్ చేశారు.కాగా నామినేషన్‌ల సందర్భంగా అఖిల్, యాంకర్ శివ మధ్య మాటల యుద్ధం జరిగింది. మొత్తంగా ఈ వారంలో హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి సరయు, అఖిల్, హమీద, అనిల్, మిత్ర, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, అషురెడ్డి, శ్రీరాపాక, మహేష్ విట్టా నామినేట్ అయ్యారు. చూడాలి మరి రెండో వారంలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో?
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక నివాసితులకు డిసెంబర్ 3 నుంచి ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.…
Hair Growth Oil : ప్రస్తుత కాలంలో ఆడ మరియు మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే…
Ysrcp : ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. ఐతే వైసీపీ కూటమి పాలనను టార్గెట్ చేస్తూ ఎన్నో రకాలుగా…
Carrot Juice : చలికాలంలో ఎక్కువగా ప్రజలు జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే శరీరం కూడా…
Turmeric And Ginger : పసుపు మరియు అల్లం ఈ రెండిటికి కూడా ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది అని ప్రత్యేకంగా…
Gold Rate : పండగ, పెళ్లి, ఫంక్షన్ ఇలా వేడుక ఏదైనా ఆభరణాల కోసం బంగారం కావాల్సిందే. అందుకే రోజు…
Banana Flower : అరటి పండ్లు మాత్రమే కాదు అరటి పువ్వు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది.…
Shoes : పూర్వికుల ప్రకారం ఇతరుల చెప్పులు మనం వేసుకోవడం వల్ల వారి దరిద్రం మనకు వస్తుందని చెప్తూ ఉంటారు. అయితే…
This website uses cookies.