Bigg Boss Telugu OTT : బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్.. రెండో వారం నామినేషన్‌లలో ఎంతమంది ఉన్నారు?
Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ రెండోవారంలోకి ప్రవేశించింది. తొలివారం హౌస్ నుంచి మొమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యింది. నిజానికి మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మొమైత్ ఖాన్ వెళ్లిపోవడంతో అందరూ అవాక్కయ్యారు. దీంతో తనను అందరూ తప్పుగా పోట్రే చేశారంటూ మొమైత్ చాలా ఎమోషనల్ అయిపోయింది. మరోవైపు రెండో వారంలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా 11 మంది నామినేట్ అయ్యారు.ఈ వారం నామినేషన్స్ చాలా డిఫరెంట్‌గా జరిగాయి. ప్రతి వారం ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున నామినేట్ చేస్తుంటారు.
అయితే ఈ వారంలో వారియర్స్ టీం నుంచి ఒక్కొక్కరు ఒక్కో ఇంటి సభ్యుడిని మాత్రమే నామినేట్ చేయాలని బిగ్‌బాస్ సూచించారు. కత్తి ఇచ్చి నామినేట్ చేయాలనుకున్న వాళ్ల ఫొటోపై గుచ్చి నామినేట్ చేయాలని చెప్పారు.సరయు యాంకర్ శివను, అషురెడ్డి మిత్రా శర్మను, అఖిల్ యాంకర్ శివను, తేజస్వి అనిల్‌ను, మహేష్ విట్టా అనిల్‌ను, నటరాజ్ మాస్టర్ యాంకర్ శివను, హమీదా మిత్రా శర్మను, అరియానా శ్రీరాపాకను నామినేట్ చేశారు. అటు ఛాలెంజర్స్ టీమ్ తరఫున ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేశారు.
Bigg Boss Telugu OTT : నామినేట్ అయిన వారు వీరే..
ఆర్జే చైతూ.. అఖిల్‌ను, స్రవంతి చొక్కారపు సరయును, శ్రీరాపాక అరియానాను, అనిల్ సరయును, అజయ్ సరయును, బిందుమాధవి నటరాజ్ మాస్టర్‌ను, మిత్రా శర్మ అషురెడ్డిని, యాంకర్ శివ సరయును నామినేట్ చేశారు.కాగా నామినేషన్‌ల సందర్భంగా అఖిల్, యాంకర్ శివ మధ్య మాటల యుద్ధం జరిగింది. మొత్తంగా ఈ వారంలో హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి సరయు, అఖిల్, హమీద, అనిల్, మిత్ర, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, అషురెడ్డి, శ్రీరాపాక, మహేష్ విట్టా నామినేట్ అయ్యారు. చూడాలి మరి రెండో వారంలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో?