BiggBoss 6 Telugu : ఆది రెడ్డి మీద అలా కసి తీర్చుకుంటున్న బిగ్ బాస్.. మరీ ఇంత ఘోరమా అసలు ఊహించలేదుగా..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 8, 2022, 1:30 pm

BiggBoss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ఈసారి కామన్ మ్యాన్ కేటగిరిలో బిగ్ బాస్ రివ్యూయర్ ఆది రెడ్డి ఛాన్స్ అందుకున్నాడు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న అతను హౌస్ లో తన మార్క్ ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. మొదటి రెండు వారాలు ఆది రెడ్డి మీద బిగ్ బాస్ ఫోకస్ పెట్టాడు. ఎక్కడ అతను దొరుకుతాడా నెగటివ్ చేద్దామా అని చూశాడు. మూడవ వారం అతను కెప్టెన్ గా కూడా నిలిచాడు. అయితే ఆది రెడ్డి గ్రాఫ్ పెరుగుతూ వస్తున్న టైం లో బిగ్ బాస్ టీం అతన్ని చూపించడం మానేసింది. ఆది రెడ్డికి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది.

ఏదో ఒకటి రెండు సార్లు తప్ప ఆది రెడ్డి అసలు హౌస్ లో ఉన్నాడా లేడా అన్న విధంగా బిగ్ బాస్ టీం ఎడిటింగ్ ఉంది. అయితే ఓ పక్క బిగ్ బాస్ లైవ్ వస్తున్నా అక్కడ కూడా పెద్దగా ఆది రెడ్డి మీద ఫోకస్ పెట్టట్లేదు. అంతేకాదు ఆది రెడ్డి కూడా మొదటి రెండు మూడు వారాల్లో ఉన్న దూకుడు ఇప్పుడు చూపించట్లేదు.బిగ్ బాస్ రివ్యూస్ చెప్పి దాని వల్ల ఫేమస్ అవడమే ఆది రెడ్డి చేసిన తప్పని.. దాని వల్లే బిగ్ బాస్ టీం అతన్ని టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే నామినేషన్స్ లో ఎలాగు లేడు కాబట్టి ఆది రెడ్డికి పెద్దగా రిస్క్ లేదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ టీం ఆది రెడ్డి మీద కక్ష్య సాధిస్తున్నారు అన్నది కొందరి వాదన.

BiggBoss 6 Telugu team revenge on reviewer aadi reddy

BiggBoss 6 Telugu team revenge on reviewer aadi reddy

తప్పకుండా ఆది రెడ్డి టాప్ 5 లో ఉంటాడని చెబుతున్నారు. అఫ్కోర్స్ అతనికి ఉన్న ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. బిగ్ బాస్ టీం చూపించినా చూపించకపోయినా ఆది రెడ్డి తన ఆట తీరు ఆడుతున్నాడు. తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తాడని అంటున్నారు. ఈ సీజన్ లో వచ్చిన హౌస్ మెట్స్ అంతా కూడా ఆట మీద అంత ఫోకస్ గా లేరు అన్నది అర్ధమవుతుంది. ఎవరో ఒకరిద్దరు తప్ప టాస్క్ లల్లో అసలు ఆశించిన పర్ఫార్మెన్స్ కూడా చేయట్లేదు. అయితే కొందరు మాత్రం ఊహించిన దాని కన్నా ఎక్కువ ఆట ఆడుతూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.

Rame Samhith

No bio available for this author.

  1. "Cheyutha Pensions : రేవంత్ సర్కార్ భారీ గుడ్‌న్యూస్‌.. 4,63,857 మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న నగదు జమ..!"

  2. "Karthika Deepam 2 Today Episode November 16 2026 : పారిజాతం కిడ్నాప్.. జ్యోత్స్నను విడదీయడానికి మాలిని మాస్టర్ ప్లాన్.. సూరజ్‌కు బిగ్ షాక్!"

  3. "Gold Rate Today : బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. వరుసగా దిగొస్తున్న ధరలు.. 2026 నవంబర్ 16న తాజా రేట్లు ఇవే!"

  4. "Cyclone Akvan 2026 : ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుఫాన్.. నవంబర్ 19, 20 తేదీల్లో అతి భారీ వర్షాలు..!"

  5. "Electricity Units : ఒక యూనిట్ కరెంట్ అంటే ఎంత? మీ ఇంట్లో ఏ పరికరం ఎన్ని యూనిట్ల కరెంట్ వాడుతుంది? ఈ లెక్క తెలిస్తే బిల్లు తగ్గించుకోవచ్చు!"

  6. "Koti Somavaram 2026 : నేడు కార్తీక మాసం కోటి సోమవారం.. శివుడికి ఇలా పూజ చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం..!"

  7. "Today Horoscope : 16 నవంబర్ 2026 సోమవారం ఈ రోజు మీ రాశి ఫలాలు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp