Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ఐదవ వారం నుంచి చంటి ఎలిమినేట్ అయ్యాడు. జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ కి వచ్చిన సెకండ్ కంటెస్టంట్ అతను. బిగ్ బాస్ సీజన్ 4లో ముక్కు అవినాష్ బిగ్ బాస్ కి వచ్చి అలరించాడు. అవినాష్ తనకు వచ్చిన ఈ ఛాన్స్ ని సరిగా వాడుకున్నాడు అయితే అదే జబర్దస్త్ ఇమేజ్ తో వచ్చిన చంటి మాత్రం నిరాశ పరచాడు. హౌస్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేస్తాడు అనుకున్న చంటి అసలేమాత్రం ఆకట్టుకోలేదు. లాస్ట్ వీక్ జరిగిన హోటల్ టాస్క్ లో కూడా చంటి కి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. దానిలో అయినా చంటి తన సత్తా చాటుతాడు అనుకుంటే అది కూడా నీరుగార్చేశాడు.
ఇక హౌస్ లో తన పర్ఫార్మెన్స్ హిట్ ఆర్ ఫ్లాప్ అని నాగార్జున అడిగితే తనకు తాను ఫ్లాప్ అనేసుకున్నాడు. సో చంటి హౌస్ కి తను అన్ ఫిట్ అని ఫిక్స్ అయ్యాడు. జబర్దస్త్ లో తన స్కిట్స్ తో అలరించిన చంటి ఎందుకు హౌస్ లో ఫ్లాప్ అయ్యాడు. ఏమాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. అయితే చంటి ఇలా చేయడం వెనక తన ఫ్యామిలీ ఎమోషన్స్ అని తెలుస్తుంది. హౌస్ లో చంటి ఎందుకో తన ఫ్యామిలీ పట్ల ఎమోషనల్ కి గురయ్యాడని తెలుస్తుంది. బిగ్ బాస్ కంటే తన ఫ్యామిలీ కూతురు ఎక్కువ అని అనుకున్నాడు. అందుకే బిగ్ బాస్ ని చాలా లైట్ తీసుకున్నాడు. పర్ఫార్మెన్స్ చేయకపోతే ఎలాగు ఆడియన్స్ పంపిస్తారని తెలుసు. అందుకే హౌస్ లో చంటి అలా నామమాత్రంగా ఉన్నాడని తెలుస్తుంది.
BiggBoss 6 Telugu why chanti more disappointed audiance
చంటి ఎలిమినేట్ అయ్యాక బయట ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూస్తే కూడా తన ఫ్యామిలీని మిస్ అవుతున్న కారణంగానే తను హౌస్ లో సరిగా పర్ఫార్మ్ చేయలేదని. బిగ్ బాస్ వాళ్లు ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా తన ఫ్యామిలీ తనకు ముఖ్యమని అన్నారు. హౌస్ లో తాను అసలు ఆట ఆడలేదని.. ఎందుకో ఆడాలని అనిపించలేదని అన్నారు చంటి. మరి బిగ్ బాస్ గురించి చంటి ఏమనుకున్నాడో. అనవసరంగా జబర్దస్త్ లో మంచి ఛాన్స్ ని సైతం కాదనుకుని బిగ్ బాస్ కి వచ్చి అక్కడ ఫ్లాప్ అయ్యాడు. బిగ్ బాస్ 6 లో టాప్ 5 దాకా ఉంటాడు అనుకున్న చంటి ఎందుకు ఇలా నిరుత్సాహపరిచాడు అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ 6 లో చంటి నిష్క్రమణ ఆడియన్స్ ని కొంత నిరుత్సాహపరచింది. మరి చంటి తన నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడు అన్నది తెలియాల్సి ఉంది.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.