Home » Entertainment » Netizens Targeted Ram Charan For Godfather Collections Poster
Entertainment

Ram Charan : మళ్ళీ రామ్ చరణ్ ని ఏసుకుంటున్న నెటిజెన్లు.. అడ్డంగా బుక్ అయ్యాడు..!

Authored By
Rame Samhith
The Telugu News | Updated on: October 10, 2022 12:50 pm
Advertisement

Ram Charan : ఒక్కోసారి స్టార్ హీరోలు వారు ఇదివరకు ఇచ్చిన స్టేట్ మెంట్స్ బ్రేక్ చేస్తే.. స్టేట్ మెంట్ ఇచ్చిన వారికి గుర్తు ఉండదేమో కానీ ఆ స్టేట్ మెంట్ విని.. మళ్లీ దాన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రం ఆడియన్స్ రివర్స్ లో ఏసుకుంటారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ కి అదే జరుగుతుంది. చరణ్ ఒకప్పుడు ఇంటర్వ్యూలో తనకు సినిమా కలక్షన్స్ పోస్టర్స్ మీద వేయడం నచ్చదని. తన సినిమాలకు ఇక మీదట అలా వేయనని అన్నారు. అంతేకాదు తన ప్రొడక్షన్ లో వచ్చే సినిమాలకు కూడా అలా వేయించనని అన్నారు.

Advertisement

చరణ్ అప్పుడన్న మాటలని గుర్తు పెట్టుకున్న ఆడియన్స్ లేటెస్ట్ గా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా 100 కోట్ల పోస్టర్ పై రివర్స్ పంచులు వేస్తున్నారు. కేవలం మాటలు చెప్పడం వరకేనా పాటించేది ఏమైనా ఉందా అని నెటిజెన్లు చరణ్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు. గాడ్ ఫాదర్ సినిమా 100 కోట్ల పోస్టర్ పై రగడ మొదలైంది. అసలు సినిమా అంత కలెక్ట్ చేసిందా లేదా అన్న లెక్కలు ఓ పక్క చేస్తుంటే.. పోస్టర్స్ విషయంలో చరణ్ ఇదివరకు చేసిన కామెంట్స్ తో మరోపక్క ఆడుకుంటున్నారు. మరి అలా స్టేట్ మెంట్స్ ఇచ్చి మళ్లీ వాటిని బ్రేక్ చేస్తే ఇలాంటి కామెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.

netizens targeted ram charan for godfather collections poster

Advertisement

ఏది ఏమైనా చరణ్ ఈ విషయంలో తప్పు చేశాడని మెగా ఫ్యాన్స్ కూడా కన్ విన్స్ అవుతున్నారు. ఇక చరణ్ సినిమా విషయానికి వస్తే శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2023 సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ కి నేషనల్ వైడ్ గా భారీ మార్కెట్ ఏర్పడింది. దాన్ని క్యాష్ చేసుకునేలా ఆర్సీ 15వ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి