Bimbisara ; తమిళ్ స్టార్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ విడుదలకు సిద్ధం అయింది. ఆ సినిమా ను తమిళ బాహుబలి అంటూ అక్కడ మీడియా ఆకాశానికి ఎత్తేస్తుంది. స్టార్ కాస్టింగ్ విషయంలో అద్భుతం అన్నట్లుగా కళ్లు పెద్దవి చేసి చూసే విధంగా ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో మంది స్టార్స్ సినిమాలో నటించడం వల్ల సహజంగానే తమిళ ఆడియన్స్ లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కానీ బయట భాషల్లో ఎక్కడ కూడా సినిమా గురించి పెద్దగా ప్రచారం జరగడం లేదు. కానీ తమిళ వారు మాత్రం నానా హంగామా చేస్తూ హడావుడి చేస్తూ పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలు బయటి రాష్ట్రాల్లో కూడా పీక్స్ లో నిర్వహిస్తున్నా కూడా జనాల్లో సినిమా గురించి మాత్రం పెద్దగా చర్చ జరగడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇలాంటిది ఈ సినిమా ను బాహుబలి సినిమా తో పోల్చడంను కొందరు అవివేకం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా కు మంచి ఆదరణ ప్రేక్షకుల నుండి వచ్చే అవకాశం ఉంది.. కానీ తెలుగు ప్రేక్షకుల నుండి ఇతర భాషల ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణ వచ్చే అవకాశం లేదని క్లారిటీ వచ్చేసింది.
అందుకే ఈ సినిమా ని బాహుబలి సినిమా తో పోల్చుకోవడం కంటే బింబిసారా సినిమాను బీట్ చేయండి చాలు అంటూ కొందరు తెలుగు సినిమా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమా సక్సెస్ అయితే అదో గొప్ప విజయం గా పేర్కొంటున్నారు. కానీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కూడా బాహుబలి సినిమా సాధించిన వసూళ్ల లో కనీసం సగం వసూళ్లని కూడా రాబట్టలేదు అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి ప్రస్థావన లేకుండా ఈ సినిమా ను ప్రమోట్ చేసుకుంటే ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.