Bimbisara : బాహుబలితో కాదు.. బింబిసారతో పోటీ పడండి చూద్దాం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bimbisara : బాహుబలితో కాదు.. బింబిసారతో పోటీ పడండి చూద్దాం!

 Authored By prabhas | The Telugu News | Updated on :8 September 2022,9:00 pm

Bimbisara ; తమిళ్ స్టార్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్‌ సెల్వన్ విడుదలకు సిద్ధం అయింది. ఆ సినిమా ను తమిళ బాహుబలి అంటూ అక్కడ మీడియా ఆకాశానికి ఎత్తేస్తుంది. స్టార్ కాస్టింగ్ విషయంలో అద్భుతం అన్నట్లుగా కళ్లు పెద్దవి చేసి చూసే విధంగా ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో మంది స్టార్స్ సినిమాలో నటించడం వల్ల సహజంగానే తమిళ ఆడియన్స్ లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కానీ బయట భాషల్లో ఎక్కడ కూడా సినిమా గురించి పెద్దగా ప్రచారం జరగడం లేదు. కానీ తమిళ వారు మాత్రం నానా హంగామా చేస్తూ హడావుడి చేస్తూ పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలు బయటి రాష్ట్రాల్లో కూడా పీక్స్‌ లో నిర్వహిస్తున్నా కూడా జనాల్లో సినిమా గురించి మాత్రం పెద్దగా చర్చ జరగడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇలాంటిది ఈ సినిమా ను బాహుబలి సినిమా తో పోల్చడంను కొందరు అవివేకం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా కు మంచి ఆదరణ ప్రేక్షకుల నుండి వచ్చే అవకాశం ఉంది.. కానీ తెలుగు ప్రేక్షకుల నుండి ఇతర భాషల ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణ వచ్చే అవకాశం లేదని క్లారిటీ వచ్చేసింది.

Bimbisara Criticism of Ponniyan selvan movie by Telugu audience

Bimbisara Criticism of Ponniyan selvan movie by Telugu audience

అందుకే ఈ సినిమా ని బాహుబలి సినిమా తో పోల్చుకోవడం కంటే బింబిసారా సినిమాను బీట్ చేయండి చాలు అంటూ కొందరు తెలుగు సినిమా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమా సక్సెస్ అయితే అదో గొప్ప విజయం గా పేర్కొంటున్నారు. కానీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కూడా బాహుబలి సినిమా సాధించిన వసూళ్ల లో కనీసం సగం వసూళ్లని కూడా రాబట్టలేదు అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి ప్రస్థావన లేకుండా ఈ సినిమా ను ప్రమోట్‌ చేసుకుంటే ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది