Home » Entertainment » Bimbisara Director Vashisht Movie With Jr Ntr
Entertainment

Jr NTR : బింబిసార 2.. ఎన్టీఆర్‌ తో చర్చలు జరిపిన దర్శకుడు, ఏం జరుగుతోంది?

Authored By
aruna
The Telugu News | Published on: August 20, 2022, 2:20 pm
Advertisement

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అంటూ అంతా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్‌ 30 అదుగో ఇదుగో అన్నట్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివ కాంబోలో రూపొందాల్సిన సినిమా కాస్త వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఆగస్టు లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్‌ లో కాని సినిమాను ప్రారంభించే అవకాశం లేదని.. అప్పటి వరకు సినిమా ను కనీసం మొదలు పెట్టి షూట్‌ చేసే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు ముఖ్యంగా కొరటాల కు సన్నిహితంగా ఉండే వారి నుండి సమాచారం అందుతోంది.

Advertisement

ఇదే సమయంలో ఎన్టీఆర్‌ ఇతర సినిమా ల గురించి చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌ తో బుచ్చి బాబు సినిమాకు సిద్ధం అయ్యాడు. ఉప్పెన సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా ప్రారంభం అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను ఈయన చేసేందుకు ఓకే చెప్పాడు. అది కూడా వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తామని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

bimbisara director vashisht movie with Jr NTR

Advertisement

ఈ సమయంలోనే బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ఠ్ ఒక కథతో ఎన్టీఆర్‌ ని కలిశాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ కథ బింబిసార 2 కథ అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఫ్రెష్ కథ అని ఆయన చాలా కాలం క్రితం రాసుకున్న కథ అన్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. ఎన్టీఆర్ తో వశిష్ఠ్ సినిమా కనుక ఓకే అయితే అది చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఒక వేళ బింబిసార 2 సినిమా లో కళ్యాణ్ రామ్‌ తో కనుక సినిమా ను చేసే అవకాశం ఉంటే మాత్రం ఆ సినిమా స్థాయి అమాంతం పెరిగినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి