Bimbisara Movie : బింబిసార ఎఫెక్ట్‌.. ఇన్నాళ్లు మొహం చాటేసిన వాళ్లే ఇప్పుడు రిక్వెస్ట్‌ చేస్తున్నారట

 Authored By prabhas | The Telugu News | Updated on :11 August 2022,11:30 am

Bimbisara Movie : నందమూరి కళ్యాన్ రామ్‌ హీరోగా నటించిన బింబిసార సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇన్నాళ్లు కళ్యాన్ రామ్‌ సినిమా నా అయితే లైట్ తీసుకోవచ్చు అనుకున్న ప్రేక్షకులు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒక సారి బింబిసార ను చూడాలి అనుకుంటున్నారు. అంతగా సూపర్ హిట్‌ అయిన బింబిసార సినిమాకు సంబంధించిన వసూళ్లు అందరిని ఆశ్చర్యపర్చింది. 13 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఏకంగా 25 కోట్ల షేర్‌ రాబట్టింది అని సమాచారం అందుతోంది. ఇప్పటికే 12 కోట్ల రూపాయల లాభం దక్కింది.

కళ్యాణ్‌ రామ్‌ కు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఆయన సినిమా లను పంపిణీ చేసేందుకు ఆసక్తి చూపించని బయ్యర్లు ఇప్పుడు భారీ ఎత్తున ఆయన సినిమాలకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయనతో గతంలో సినిమాలను నిర్మించేందుకు ఆసక్తి చూపించని నిర్మాతలు కూడా ఇప్పుడు కళ్యాణ్‌ రామ్‌ డేట్ల కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు కళ్యాణ్ రామ్‌తో సినిమాలు చేద్దామా అంటూ ఎదురు చూస్తున్నారు.నందమూరి కళ్యాణ్ రామ్‌ తో తాజాగా ఒక నిర్మాత చర్చలు జరిపాడట.

Bimbisara Movie effect kalyan Ram getting back to back office

Bimbisara Movie effect kalyan Ram getting back to back office

ఆయన గతంలో కళ్యాణ్ రామ్ తో సినిమా చేసేందుకు మొహం చాటేశాడు. కాని ఇప్పుడు మాత్రం ఆయన స్వయంగా కళ్యాణ్ రామ్‌ వద్దకు వచ్చి సినిమా చేద్దాం అంటూ అడిగాడట. ఆ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ నిర్మాత ఎవరు అనే విషయంలో క్లారిటీ లేదు కాని ఆ నిర్మాత కు కళ్యాన్ రామ్‌ నో చెప్పాడట. గతంలో తనతో సినిమాలు చేసిన నిర్మాతలతో మళ్లీ చేసేందుకు కళ్యాణ్ రామ్‌ సిద్ధం అవుతున్నాడు అనేది సమాచారం. మొత్తానికి కళ్యాణ్ రామ్‌ రేంజ్ పెరిగి పోయింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి