Amigos Movie : వరుస హిట్లు కొడుతున్న నందమూరి హీరోలు .. ‘ అమిగోస్ ‘ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :10 February 2023,12:40 pm

Amigos Movie : గతేడాది ‘ బింబిసార ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అంతే కాదు క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే రు. 40 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టి తిరుగులేని క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ హిట్ ట్రాక్‌ను క‌ళ్యాణ్ త‌న తాజా సినిమా అమిగోస్‌తోనూ కంటిన్యూ చేశాడు. ఈరోజు విడుదలైన ఈ సినిమా అదిరిపోయే టాక్ ను సంపాదించుకుంది. నాలుగు నెల‌ల గ్యాప్‌లో క‌ళ్యాణ్ రెండో సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు ముందు నుంచి అన్నీ క‌లిసి వ‌చ్చాయి.

Nandamuri Kalyan Ram Amigos Movie hit talk

Nandamuri Kalyan Ram Amigos Movie hit talk

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో నటించారు. ఓ పాత్రలో నెగటివ్ గా కనిపించి అదరగొట్టేశాడు. ఇక ఈ సినిమాను మైత్రి బ్యానర్ లో నిర్మించారు. ముందే ప్రి రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అవ్వ‌డం, అడ్వాన్స్ బుకింగ్‌లు బాగుండ‌డం ఇవ‌న్నీ ఈ సినిమాకు చాలా క‌లిసొచ్చాయి. మైత్రి బ్యానర్ లో సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా ఈ బ్యానర్ లో రావడం కొంత ప్లస్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోవడంతో కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ సెలక్షన్ మరోసారి అదిరింది అని అంటున్నారు.

Nandamuri Kalyan Ram Amigos Movie hit talk

Nandamuri Kalyan Ram Amigos Movie hit talk

అమిగోస్ సినిమా థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది. తెలుగు ప్రేక్షకులకు ఇది భిన్నమైన అనుభవం అని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఇక డైరెక్టర్ రాజేంద్రరెడ్డి ట్రిపుల్ రోల్ క్యారెక్టర్స్ ను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చేశాడని జనాలు అంటున్నారు. ముఖ్యంగా బిపిన్ రాయ్ క్యారెక్టరైజేషన్ ఎంతో స్పెషల్ గా నిలిచింది. కళ్యాణ్ ఆ పాత్రను చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఏదేమైనా ప్రస్తుతం ఇండస్ట్రీలో నందమూరి హీరోలు వరుసగా హిట్లు కొడుతున్నారు. బాలయ్య అఖండ వీరసింహారెడ్డి సినిమాలతో, తారక్ రామ్ వరుసగా ఆరు హిట్లు, కళ్యాణ్ రామ్ బింబిసార, అమిగోస్ సినిమాతో సూపర్ హిట్లు కొట్టారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి