Bimbisara Movie : బింబిసార సీక్వెల్ స‌న్నాహాలు.. మించి ఉంటుంద‌ట‌..!

Authored By Sam C | The Telugu News | Published on: August 6, 2022, 4:40 pm

Bimbisara Movie : కొన్నాళ్లుగా హిట్స్ లేక నానా ఇబ్బందులు ప‌డుతున్న క‌ళ్యాణ్ రామ్ బింబిసార చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా అత‌నికి రెట్టింపు ఉత్సాహాన్ని అందించింది. నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా వశిష్ఠ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార సినిమా ఆగ‌స్ట్ 5న‌ ప్రేక్షకుల ముందుకు రాగా, సినిమా లో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించి మెప్పించాడు. సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా సీజీ వర్క్ కూడా బాగా సెట్‌ అయ్యిందని రివ్యూలు వస్తున్నాయి. తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో సాయంత్రానికి థియేటర్ల దగ్గర రద్దీ పెరిగింది. ‘బింబిసార’గా కల్యాణ్ రామ్ ఈ సినిమాలో బాగా చేశాడు. తొలి ఆటతోనే ఇలా ఆడియన్స్ ను ప్రభావితం చేయడం ఆయన కెరియర్లోనే ఫస్టు టైమ్ అని చెప్పాలి…

Bimbisara Movie : బింబిసార సీక్వెల్..

రీసెంట్‌గా ఈ సినిమా గురించి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. ‘బింబిసార’ను ఈ స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. తాను అనుకున్నట్టే కీరవాణిగారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచిందనీ, ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందని చెప్పాడు. సీక్వెల్ మరింత గ్రాండ్ గా ఉండేలా చూస్తామని అన్నాడు. ‘బింబిసార’లో సీక్వెల్ కి తగిన కంటెంట్ ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడం .. రాజు పాత్ర వైపు నుంచి రొమాన్స్ పాళ్లు లోపించడం .. పవర్ఫుల్ డైలాగ్స్ లేకపోవడం జరిగింది. ఈ లోపాలను సరిచేసుకుంటూ వెళితే సీక్వెల్ కూడా ఆకట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

bimbisara  sequel plan says kalyan ram

bimbisara  sequel plan says kalyan ram

బింబిసార కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో రూ.5 కోట్లు, సీడెడ్‌లో 2 కోట్లు, ఆంధ్రా 6.5 కోట్లు బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా 13.50 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా 1.1 కోట్లు, ఓవర్సీస్‌లో 1 కోటితో మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్ల మేర బిజినెస్ చేసింది.

Sam C

No bio available for this author.

  1. "AP Telangana Weather Alert : తీరం దాటిన మురసు తుఫాన్‌.. ఏపీ, తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు!"

  2. "AP Municipal Election Results : ఏపీలో కూటమి ప్రభంజనం.. పులివెందులలోనూ వైసీపీకి షాక్!"

  3. "Superstar Krishna Remuneration : సూపర్ స్టార్ కృష్ణ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? విజయనిర్మల చెప్పిన ఆసక్తికర విషయాలు!"

  4. "US Midterm Elections 2026 : అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే మనకు లాభమా? నష్టమా?"

  5. "Chandrababu : డిసెంబరులో ఏపీ కేబినెట్‌లో మార్పులు? పల్నాడు, రాయలసీమ కు కొత్త మంత్రులు!"

  6. "Home Loan Tips : బ్యాంకులు చెప్పని సీక్రెట్‌.. 20 ఏళ్ల హోమ్ లోన్‌ను త్వరగా తీర్చాలా? ఈ 5 స్మార్ట్ EMI పద్ధతులు పాటించండి..!"

  7. "AP Municipal Election Results : ఏపీ మున్సిపల్ ఫలితాలకు అంతా రెడీ.. ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp