Karthikeya 2 : బింబిసార.. సీతారామం.. కార్తికేయ 2.. మూడు సినిమాల్లో ఏది గ్రేట్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthikeya 2 : బింబిసార.. సీతారామం.. కార్తికేయ 2.. మూడు సినిమాల్లో ఏది గ్రేట్‌

 Authored By aruna | The Telugu News | Updated on :23 August 2022,9:20 pm

Karthikeya 2 : టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్దకు కేవలం మూడు వారాల వ్యవధిలో వచ్చిన బింబిసార.. సీతారామం మరియు కార్తికేయ 2 సినిమా లు భారీ వసూళ్లను నమోదు చేశాయి.. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కలిసి ఏకంగా 250 కోట్ల వసూళ్ల వరకు నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ మూడు సినిమా ల్లో కార్తికేయ 2 సినిమా ను తోపు సినిమా గా ప్రేక్షకులతో పాటు అంతా కూడా చర్చించుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద డ్రై వాతావరణం ఉంది అనుకుంటూ ఉండగా ఈ మూడు సినిమాలు వచ్చి కుమ్మేశాయి. మంచి కంటెంట్‌ తో వస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆధరిస్తారు అంటూ ఈ సినిమాలు నిరూపించాయి.

తెలుగు సినిమాలు సాధిస్తున్న విజయాలు చూసి బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. బింబిసార కాకుండా కార్తికేయ 2 మరియు సీతారామం సినిమా లు హిందీలో కూడా ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కార్తికేయ 2 సినిమా హిందీ లో సాధిస్తున్న వసూళ్లను చూసి అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అక్కడ దాదాపుగా 20 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయినట్లుగా సమాచారం అందుతోంది. తక్కువ సమయంలో స్క్రీన్స్‌ పెంచుతూ పోయి ఏకంగా 800 షో లు ఒక్క రోజు హిందీ వర్షన్ పడింది అంటే కార్తికేయ 2 సినిమా ను అక్కడి ప్రేక్షకులు ఎంతగా ఆధరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు..

which movie is the best in this three bimbisara sita ramam and karthikeya 2 movies

which movie is the best in this three bimbisara sita ramam and karthikeya 2 movies

ఈ మూడు సినిమాలతో పోల్చితే కచ్చితంగా కార్తికేయ 2 సినిమా చాలా స్పెషల్‌ అనడంలో సందేహం లేదు. హిందీలో అసలు విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. అలాంటి సమయంలో కేవలం 50 స్క్రీన్స్ తో మొదలైన ప్రస్థానం కాస్త పాతిక కోట్ల వైపుకు దూసుకు పోతుంది అంటూ కార్తికేయ 2 ను ఎంత పొగిడినా తక్కువే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్‌ వర్గాల వారు కార్తికేయ 2 సినిమా మరో వారం రోజుల్లో వంద కోట్ల వసూళ్లు సాధిస్తుంది అంటూ నమ్మకంగా చెబుతున్నారు. కేవలం హిందీ వర్షన్‌ సినిమాకు పెట్టిన ఖర్చు మొత్తం రాబట్టింది. త్వరలోనే ఇతర సౌత్‌ భాషల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది