Bimbisara Movie : కొన్నాళ్లుగా హిట్స్ లేక నానా ఇబ్బందులు పడుతున్న కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా అతనికి రెట్టింపు ఉత్సాహాన్ని అందించింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ్ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాగా, సినిమా లో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించి మెప్పించాడు. సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా సీజీ వర్క్ కూడా బాగా సెట్ అయ్యిందని రివ్యూలు వస్తున్నాయి. తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో సాయంత్రానికి థియేటర్ల దగ్గర రద్దీ పెరిగింది. ‘బింబిసార’గా కల్యాణ్ రామ్ ఈ సినిమాలో బాగా చేశాడు. తొలి ఆటతోనే ఇలా ఆడియన్స్ ను ప్రభావితం చేయడం ఆయన కెరియర్లోనే ఫస్టు టైమ్ అని చెప్పాలి…
రీసెంట్‌గా ఈ సినిమా గురించి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. ‘బింబిసార’ను ఈ స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. తాను అనుకున్నట్టే కీరవాణిగారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచిందనీ, ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందని చెప్పాడు. సీక్వెల్ మరింత గ్రాండ్ గా ఉండేలా చూస్తామని అన్నాడు. ‘బింబిసార’లో సీక్వెల్ కి తగిన కంటెంట్ ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడం .. రాజు పాత్ర వైపు నుంచి రొమాన్స్ పాళ్లు లోపించడం .. పవర్ఫుల్ డైలాగ్స్ లేకపోవడం జరిగింది. ఈ లోపాలను సరిచేసుకుంటూ వెళితే సీక్వెల్ కూడా ఆకట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
బింబిసార కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో రూ.5 కోట్లు, సీడెడ్‌లో 2 కోట్లు, ఆంధ్రా 6.5 కోట్లు బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా 13.50 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా 1.1 కోట్లు, ఓవర్సీస్‌లో 1 కోటితో మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్ల మేర బిజినెస్ చేసింది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.