Home » Entertainment » Bimbisara Vs Sita Ramam Movies Box Office Collections
Entertainment

Bimbisara – Sita Ramam : బింబిసార వర్సెస్‌ సీతారామం… అయ్యో పాపం ఎంత పనైంది

Authored By
aruna
The Telugu News | Published on: August 6, 2022, 8:30 am
Advertisement

Bimbisara – Sita Ramam : గత మూడు వారాలుగా వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చాయి. ప్రతి సినిమా కూడా మినిమం టాక్ కూడా దక్కించుకోలేక పోవడంతో కనీసం జనాలు ఆ సినిమా పోస్టర్ లను కూడా చూసేందుకు ఆసక్తి చూపించలేదు. సినిమాకు నెగటివ్‌ టాక్‌ వస్తే చాలు సినిమా థియేటర్ల నుండి ఆ సినిమా లను తీసేయమే అవుతుంది. మొదటి వారం రోజులు కూడా ఏమాత్రం జనాలు రావడం లేదు. మొన్నటి వరకు పరిస్థితి అలాగే ఉంది. మూడు వారాల పాటు బాక్సాఫీస్‌ వెల వెల.

Advertisement

ఉన్నట్లుండి ఒక్కసారిగా బాక్సాఫీస్ కళ కళ మొదలైంది. నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా నటించిన బింబిసార సినిమా తో పాటు దుల్కర్ సల్మాన్ మరియు మృనాల్‌ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీతారామం సినిమా విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమా లు బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తున్నాయి. రెండు సినిమా లకు కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యం లో వసూళ్లు ఎలా ఉంటాయి అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రెండు కూడా వసూళ్ల విషయంలో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.

bimbisara vs sita ramam movies box office collections

Advertisement

ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు పోటీ పడి రాలేదు. కాని ఈ వారం మాత్రమే పోటీ నెలకొంది. ఒకే సారి రెండు సినిమాలు అంటే కచ్చితంగా నష్టం తప్పదు. రెండు సినిమాలకు కూడా నష్టం తప్పదు. ఈ రెండు సినిమాలు ఒకే రోజు కాకుండా వారం గ్యాప్ తో అయినా వచ్చి ఉంటే బాగుండేది అని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఆయా సినీ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం ఒకటి ఈ వారం ఒకటి విడుదల అయ్యి ఉంటే రెండు సినిమాలకు కూడా వసూళ్లు చాలా డీసెంట్‌ గా ఉండేవి అనేది విశ్లేషకుల మాట. అయ్యో ఎంత పనైంది అనేది బాక్సాఫీస్ వర్గాల మాట.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి